-జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపట్టిన సాధారణ భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గొల్లపూడి రైల్వే లైన్ సంబంధించి ప్లానింగ్ నోటిఫికేషన్ సకాలంలో పంపాలని సబ్ కలెక్టర అదితి సింగ్‌ను ఆదేశించారు. జక్కపూడి ఫ్లైఓవర్ పనులకు అవార్డు పాస్ అయిందని దీనికి సంబంధించి రైతులకు నష్టపరిహారం ఈ వారంలోగా పంపిణీ చేయాలన్నారు. జగ్గయ్యపేట ముత్యాలంపాడు ఇన్‌లాండ్ వాటర్ వేవ్ సంబంధించి అవార్డ్‌ను వచ్చే వారానికి పాస్ చేయాలన్నారు. చంద్రల`వెలవడం సాధారణ భూ సర్వే సంబంధించి అవార్డ్‌ను ఒక వారం లోపు పాస్ చేయించి పంపాలని సంబంధిత ఆర్‌డివోను అదేశించారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్‌కు సంబంధించి 15 గ్రామాలు ఉన్నాయని వీటిలో 14 గ్రామాలకు మార్కెంట్ ధర ప్రతి పాదనలు సిద్దం చేసి నవంబర్ నెల ఆఖరునకు అవార్డు పాస్ చేయించాలన్నారు. నందిగామ బైపాస్ రోడ్డు త్రీడి నివేదికను సమర్పించాలని నందిగామ ఆర్‌డివోను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో నందిగామ ఆర్‌డివో ఏ రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డివో జి లక్ష్మి ప్రసన్న, ఆయా మండలాల తహాశీల్థార్లు ఉన్నారు.