Breaking News

నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు

-స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను పది రోజుల్లో అందజేయాలి
-క్రిస్మస్కు ముందే నవంబరులో జెరూసలెం యాత్రకు పంపేందుకు జాబితాను సిద్దం చేయాలి
-పాస్టర్లకు గౌరవేతనం మంజూరు చేసేందుకు వచ్చే నెల 5 లోపు ధరఖాస్తులను సీకరించాలి
-క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలి
-ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త ::
మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రతి నియోజక వర్గంలో రూ.1.00 కోటి విలువైన పనుల చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు అనుగుణంగా స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పదిరోజుల్లో పంపాలని ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమై శాఖా పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మసీదులు, చర్చిలు, షాదీఖానాలు, స్మశాన వాటికలు అభివృద్దికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందజేస్తున్నదని, మైనారిటీ శాఖ అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రం నుండి పవిత్ర జెరూసలేమ్ నగరానికి తీర్థయాత్రకు పంపేందుకు అర్హులైన వారి జాబితాను సత్వరమే ఖరారు చేయాలని, ఇందుకు సంబందించిన ప్రక్రియను సాద్యమైనంత త్వరగా పూర్తి చేస్తే వచ్చే మాసంలోనే క్రిస్మస్ కు ముందే వారందరినీ పవిత్ర జెరూసలేమ్ నగరానికి యాత్రకు పంపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులకు ఆయన సూచించారు. ఇప్పటి వరకూ 5 వేలకు పైబడి ఫాస్టర్లకు ప్రభుత్వం గౌరవవేతనం అందించడం జరుగుచున్నదని, ఇంకా ఎవరన్నా అర్హులు ఉంటే వారందరి నుండి వచ్చే నెల 5 వ తేదీ లోపు ధరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారి జాబితాను సత్వరమే సిద్దం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముస్లిం మైనారిటీల జాతీయ మండలి నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ త్వరగా అందేలా మరియు నిరుపేద మస్లింలకు తక్కువ వడ్డీకే ఋణ సాయం అందేలా చూడాలని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ ఎం.డి.ని ఆదేశించారు. ఉర్థూ భాష బలోపేతానికి తగు చర్యలు తీసుకోవాలని, ఉర్థూను అధికార భాషగా అమలు పర్చేందుకు జిల్లా కలెక్టర్లు అందరికీ తగు ఆదేశాలు జారీచేయాలన్నారు. ఉర్థూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెరిగేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.
రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, సంచాలకులు డా.జి.సి.కిషోర్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ హెచ్.నదీమ్ అహ్మద్, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసీఫ్ భాషా, హజ్ కమిటీ చైర్మన్ ఎస్.గౌసల్ లాసమ్, ఎ.పి.స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదిర్, వక్ఫ్ సర్వే కమిషనర్ షరీన్ బేగం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ సంచాలకులు డా.ఎన్.ఆయూబ్ హుస్సేన్, సిఇఎండి సంచాలకులు డా. మస్తాన్ వలీ, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీల కార్పొరేషన్ ఎం.డి. జె.ఎలీషా, కార్యదర్శి ఓ.ఎస్.డి. టి.నరసింహులు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్

-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *