విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తీవ్రవాద ముప్పు విద్రోహ చర్యల నుండి ప్రజలను కాపాడేందుకు అనునిత్యం ఆక్టోపస్ టీమ్ అప్రమత్తంగా ఉంటుందని ఆక్టోపస్ ఎస్పీ బి. రవిచంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఏఆర్ గ్రౌండ్స్ లో ఏపి పోలీస్ (ఆక్టోపస్) ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ విభాగ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించరు. ఆక్టోపస్ విభాగం వినియోగించే అత్యాధునిక ఆయుధాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ విభాగ ఎస్పి బి. రవిచంద్ర మాట్లాడుతూ తీవ్రవాద ముప్పు, విద్రోహ చర్యల నుండి ప్రజలను కాపాడేందుకు ఏర్పాటుచేసిన ఆక్టోపస్ వింగ్ లో ప్రతీ కమాండర్ కఠోర శిక్షణ తీసుకొని అప్రమత్తంగా ఉంటారన్నారు. జాతీయ భద్రతా దళ విభాగం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్)కు సరి సమానంగా తమ వింగ్ ఉంటుందన్నారు. నెదర్లాండ్స్ ,ఐర్లాండ్, జర్మనీ, యుఎస్ఏ వంటి ఏడు దేశాలకు చెందిన అత్యాదునిక ఆయుధాలు ఆక్టోపస్ వింగ్ లో ఉన్నాయని ఆక్టోపస్ వింగ్ కమాండోలు అనునిత్యం నిరంతరం శిక్షణ తీసుకుంటూ ఉంటారని కఠోర, శారీరక శ్రమతో ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించేలా సంసిద్ధంగా ఉంటారన్నారు. ఆక్టోపస్ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ బేస్ క్యాంప్, తిరుమల తిరుపతి దేవస్థానంలో బేస్ క్యాంప్ ద్వారా తీవ్రవాద ముప్పు, విద్రోహ చర్యలు నుండి రక్షణ కల్పిస్తుంటామన్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ అండర్ కంట్రోల్ లో ఆక్టోపస్, గ్రే హ్యాండ్స్ విభాగాలు ఉంటాయన్నారు. గత సంవత్సరం హరియానాలో జరిగిన జాతీయ భద్రతా విభాగం ఎన్ ఎస్ జి దేశవ్యాప్తంగా నిర్వహించిన అగ్ని పరీక్ష పోటీ లో మన రాష్ట్ర ఆక్టోపస్ విభాగం ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఆక్టోపస్ లో ప్రతీ కమాండర్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తీవ్రవాద దాడులు, ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటారని ఆక్టోపస్ విభాగ ఎస్పి బి. రవిచంద్ర అన్నారు. ఏపీ పోలీస్ ఆక్టోపస్ ప్రదర్శించిన అత్యాధునిక ఆయుధాలు నగర ప్రజలను, విద్యార్థులను ఆకట్టుకున్నాయి. రేపు సాయంత్రం వరకు నిర్వహించే ఓపెన్ హౌస్ ను నగర ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు సందర్శించి అవగాహన కల్పించుకోవాలని ఆయన కోరారు. ఓపెన్ హౌస్ లో ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ నగేష్ బాబు, బి రవిచంద్ర, కమాండోస్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …