విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా రిలీవ్ మెడికల్ రిహాబ్ సెంటర్‌ను విజయవాడలోని రామచంద్రాన గర్‌లో ఆదివారం ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు పాల్గొని ఎపిలో మొట్టమొదటిసారిగా ఇటువంటి అన్నిరకాల వైద్య సదుపాయాలతో విజయవాడలో రిలీవ్ మెడికల్ రిహాబ్ సెంటర్‌ను ప్రారంభించడం శుభపరిణామమని నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం తరఫున తన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ డాక్టర్.ప్రణీత్ మాట్లాడుతూ అత్యవసర చికిత్సల తరువాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పునర్జీవనా నికి అవసరమైన ఏర్పాటు ఆధునిక పద్ధతిలో ఇక్కడ లభిస్తాయన్నారు. 24 గంటలు ఆరోగ్య పరిరక్షణ ఐసియు అనుభవ నర్సింగ్ స్టాప్ దూరప్రాంతాల నుంచి వచ్చే పేషంట్లకు సొంత ఇంటి తరహాలో మనుషుల వలె సేవలందిం చటం జరుగుతుందన్నారు. రిలీవ్ సెంటర్‌కు వచ్చిన ప్రతి పేషెంట్‌కు తిరిగి వెళ్లేంతవరకు పూర్తి శ్రద్ధతో పర్య వేక్షణచేసి వైద్యసేవలు అందించటం మా రిలీవ్ సంస్థ ప్రత్యేకత అని అన్నారు. క్యాన్సర్, ఆంకాలజి ఇలా అనేక రకాలైన కేసులకు తక్కువ ఖర్చుతో ఫిజియో ధెరఫి, డ్రెస్సింగ్‌లు, మెడికల్ కేర్ ట్రీట్‌మెంట్లు ఇచ్చే కంబైన్డ్ మెడికల్ రిహాబి టేషన్ సెంటర్ అని అన్నారు. ఇది సేవాదృక్పధంతో ఏర్పాటుచేసిన రీసెర్చ్ సెంటర్ అని అన్నారు. మొదటగా 20 బెడ్స్ నుండి 50 బెడ్స్ వరకు పెంచే ప్రయత్నములో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఇబ్రహీం అబ్బాస్, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …