Breaking News

డిసెంబర్‌ 21వ తేదీన 12,264 గృహాలలో సామూహిక గృహ ప్రవేశాలు…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో డిసెంబర్‌ 21న 12 వేల 264 గృహాలలో సామూహిక గృహప్రవేశాలను నిర్వహించేందుకు నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, స్పందన గ్రీవెన్స్‌ వంటి పలు అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్‌. హౌసింగ్‌ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 21వ తేదీన సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా 12,264 గృహాలలో లబ్దిదారులతో గృహ ప్రవేశాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను నేరవేర్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. యంపిడివోలు, తహాశీల్థార్లు, హౌసింగ్‌ ఏఇల ఆధ్వర్యంలో టీమ్‌లుగా ఏర్పడి గ్రామ, వార్డు సచివాలయలలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో నమన్వయం చేసుకుని నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సామూహిక గృహ ప్రవేశాలకు వారం వారిగా నిర్థేశించిన లక్ష్యం మేరకు గృహా నిర్మాణాలను పూర్తి చేసి సిద్దం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నిర్మాణాల్లో రూప్‌ కాస్టింగ్‌ దశలో ఉన్న 12,264 గృహాలలో ఇప్పటికే 3,930 గృహాలు పూర్తి చేశామన్నారు. మిగిలినవి 8,334 గృహాలు పూర్తి చేయాలన్నారు. తిరూవురు నియోజకవర్గంలో 196, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 892, మైలవరం నియోజకవర్గంలో 3515, నందిగామ నియోజకవర్గంలో 2211, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 67, సెంట్రల్‌ నియోజకవర్గానికి సంబంధించి 1029, తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 424, గృహాలు పూర్తి చేయవలసి ఉన్నారు. ఆయా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణాలలో తుది దశలో ఉన్న రూప్‌ కాస్టింగ్‌లోని గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మండలాభివృద్ధి, హౌసింగ్‌, మున్సిపల్‌, రెవెన్యూ ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో నమోదు అయిన ఆర్జీలను నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు ఆర్జీల పరిష్కారం పై తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డ్వామా పిడి జె. సునీత, జిఎస్‌డబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి కె. అనురాధ, కార్పొరేషన్‌ హౌసింగ్‌ ఇఇ రవికాంత్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *