Breaking News

అఖిల భారత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ సభ్యులకు స్వాగతం పలికి అభినందించిన జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కొత్త వరవడిలో జాతీయ సమైక్యత భావాన్ని చాటి చెప్పి విధంగా 75 మందితో డిల్లీలో ప్రారంభమైన మోటారు సైకిల్‌ ర్యాలీ గురువారం విజయవాడ చేరుకున్న సందర్భంలో నగంంలోని బాపు మ్యూజియం వేదికగా బైక్‌రైడర్స్‌కు నెహ్రు యువ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరియు ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూత్‌ ఎఫైర్స్‌, స్పోర్ట్స్‌, కల్చర్‌, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి. వాణి మోహన్‌ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, శ్యాప్‌ ఎండి ప్రభాకర్‌రెడ్డి బైక్‌ రైడర్స్‌ని అభినందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి. వాణి మోహన్‌ మాట్లాడుతూ భారత దేశంలో విభిన్న జాతులు, భాషలు, సంస్కృతి సాంప్రదాయలు ఉన్నాయని విటిన్నంటిని సమైక్యతతో ఒక తాటి పై నడిపించుకుని చాటి చెప్పే విధంగా సాహసోపేతంగా ఆత్మస్థైర్యంతో చేపట్టిన ఈ బైక్‌ రైడిరగ్‌ యువతకు మార్గదర్శకం, స్పూర్తిదాయకం అన్నారు. 18`65 సంవత్సరాల వయసు గల 75 మంది ఎంతో ఓర్పుతో నిర్వహిస్తున్న బైక్‌ రైడ్‌లో మహిళలు పాల్గొనడం ప్రయాణంలో ఫిజికల్‌ గా సవాళ్ళను ఎదుర్కొని ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు. యువత యోగా, క్రీడలలో ఆసక్తి చూపించాలని వాణి మోహన్‌ అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీ రావు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం సాధించుకోవడంలో 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించుకోవడంతో పాటు నూతన వరవడిలో భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ అఖిల భారత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని 75 మంది దేశంలో 75 ప్రధాన నగరాలను కలుపుకుంటూ విజయవాడ నగరాన్ని చేరుకోవడం సంతోషకరమన్నారు. క్విట్‌ ఇండియా ప్రాధాన్యత తెలిపే విధంగా 21 వేల కిలో మీటర్లు బైక్‌ పై ప్రయాణించడం కష్టతరమైన చర్యఅని కలెక్టర్‌ పేర్కొన్నారు.
నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 21 వేల కిలో మీటర్లు ప్రయాణించే విధంగా బైక్‌ రైడ్‌ నిర్వహించడం సాహసంతో కూడిన గొప్ప కార్యక్రమం అని వీరంతా గమ్యస్థానానికి విజయవంతంగా క్షేమంగా చేరుకోవాలని ఆకాక్షించారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వలన పట్టణ భారతం, గ్రామీణ భారతం అర్థమవుతుందని 34 రాష్ట్రాలు 250 జిల్లాలను కలుపుతూ 75 రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమం దేశంలోనే ఒక చెప్పుకోదగిన విషయమని అన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు బైక్‌ రైడర్స్‌ ప్రతి ఒక్కరిని పేరుపేరున పలుకరించి కరచాలన చేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో శాప్‌ యండి ప్రభాకరెడ్డి, యూత్‌ సర్వీసెస్‌ కమీషనర్‌ ఎస్‌విడి రామకృష్ణ, నెహ్రు యువ కేంద్రం జిల్లా అధికారి డి కిరణమై, జిల్లా యూత్‌ వెల్ఫెర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రావు, విజయవాడ బైక్‌ రైడ్‌ంగ్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎన్‌ నిక్షిప్త, ప్రోగ్రాం కో`ఆర్డినేట్‌ డి వినోద్‌కుమార్‌, శాప్‌ ప్రతినిధి డి వినాయకప్రసాద్‌, యునైటెడ్‌ ఎన్‌జివో ప్రతినిధి యు రాంబాబు, దుర్గామల్లేశ్వర మహిళ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *