విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ మేయర్ చాంబర్ లో నగరపాలక సంస్థ పబ్లిక్ రిలేషన్ అధికారి i/c మరియు జోనల్ కమిషనర్ i/c డా. ఏ.రవిచంద్ అధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి , అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది మరియు పలువురు కార్పొరేటర్లతో కలసి భారీ కేక్ కట్ చేసి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ నగర మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నగర అభివృద్ధికి పాటుపడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఎన్నో ఆవార్థులను తెచ్చిపెట్టిన మన మేయర్ రాయన బాగ్యలక్ష్మినరేంద్రకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని తెలిపారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …