-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు బుధువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్ తో కలసి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మరియు కాంట్రాక్టర్ల తో టెండర్ల పై సమీక్షా సమావేశము నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించవలసినది గాను, నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి పూర్తి చేయునట్లుగా చూడాలని కోరారు. పూర్తి అయినటువంటి టెండర్ల బిల్లులను ప్రభుత్వం నుండి వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.
తదుపరి కాంట్రాక్టర్లు అందరు కలిసి అధికారులకు విజయవాడ నగరపాలక సంస్థ వారి క్లాత్ సంచి లను అందజేసినారు. సమావేశంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు, స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది పలువురు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.