విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలలో భూముల రీసర్వే పూర్తి అయిన 14 గ్రామాలలో హద్దులను తెలిపే రాళ్ళను నాటేె కార్యక్రమాన్నిఈ వారంలో పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢల్లీిరావు, సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్థ జైన్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్థ జైన్, సిసిఎల్‌ఎ అదనపు ప్రధాన కార్యదర్శి ఏ యండి ఇంతియాజ్‌లు వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భూముల రీసర్వే పనులు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే రీ సర్వే పూర్తి చేసిన 14 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. సర్వే పూర్తి అయిన గ్రామాలలో రికార్డులను పున:పరిశీలించి భవిష్యత్‌లో ఎటువంటి వివాధాలకు తావులేకుండా పక్కగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 41 గ్రామాలలో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి చేశామన్నారు. రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూముల హద్దులను తెలిపే రాళ్ళను నాటె కార్యక్రమాన్ని వారం లోగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ కమీసనర్ సిద్దార్థ జైన్‌కు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికాడ్స్ ఆఫీసర్ కె. సూర్యరావు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …