విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను డిసెంబర్ నాటికి నూరు శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లు, ఎలక్ట్రోల్ పాపులేషన్ (ఇపిరేషియో), తదితర అంశాలపై గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో సచివాయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫ్‌రెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ సమరీ రీవిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) లో 16 లక్షల 47 వేల 571 మంది ఓటర్లుగా నమోదయిందన్నారు. వీటిలో ఇప్పటివరకు 10 లక్షల 57 వేల 376 మంది ఓటర్ల జాబితాకు ఆధార్ డేటా అనుసంధానం జరిగిందని డిసెంబరు మాసాంతానికి నూరు శాతం ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఎలక్ట్రోల్ పాపులేషన్ రేషియో పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని దీనిలో భాగంగా జిల్లాలో జనాభా ప్రకారం 18`19 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు.
అనంతరం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, సహాయ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ మాట్లాడుతూ ఓటర్ జాబితాకు ఆధార్ అనుసంధానం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలోని మైలవరం, నగరపాల సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలో ఆధార్ అనుసంధానం, ఓటర్ నమోదు తక్కువ స్థాయిలో నమోదు జరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ మాసాంతరానికి నూరు శాతం ఓటర్ జాబితాకు ఓటర్ అనుసంధానం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితాలలో డూప్లికేషన్, మరణించిన వారి పేర్లు తొలగింపు, వివాహమై ఇతర ప్రాంతాలకు వలస వేళ్లిన వారి వివరాలను తొలగించి ఇపి రేషియో ఎక్కువగా నమోదు అయిన నియోజకవర్గాలలో మరో సారి పరిశీలన చేయాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. యువ ఓటర్ల నమోదు పై కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఓటర్ల నమోదును పెంచాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్‌పుడ్కర్, డిఆర్‌వో కె. మోహన్ కుమార్, సబ్‌కలెక్టర్ అదితి సింగ్, నగరపాలక సంస్థ అడిషనల్ కమీషనర్ ఎం. శ్యామల, ఏఆర్‌వో డా. రవిచంద్ర, ఎఇఆర్‌వో శ్రీనివాస్‌రావు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …