-సుమారు 23,554 కేసులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున చివరి కేసు పరిష్కారం చూపే వరకు ఎంత సేపైనా వేచి చూసి సమన్యాయం కోసం న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, ప్రతీ ఒక్కరూ పని చేస్తామన్నారు. కోర్టులు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని అనుకుంటూ ఉంటారన్నారు. కానీ అందరికి, జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున రాత్రి పది అయినా, 11 గంటలు అయినా జవాబుదారీతనంతో కేసుల పరిష్కారం చేస్తామని జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు వారు గత నెల రోజులుగా వారి పరిధిలో క్లైమ్స్ పరిష్కారం కోసం చక్కటి పరిష్కారం చూపడం జరుగుందన్నారు. కేసులు పరిష్కారం కోసం అవసరమైన డాక్టర్ ధృవ పత్రాలు జారీ కై వైద్య అధికారులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ఒక పండుగ వాతావరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించు కుంటున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 నూతన జిల్లాలోని (కాకినాడ, బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా) 45 బెంచ్ లలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫాక్సో, మర్డర్ వంటి కేసులు తప్ప, రాజీ ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న కేసులకు పరిష్కారం చూపుతామని, రాజీ పడదగిన వాటికి అవార్డ్ జారీ చేస్తే తిరుగు ఉండదన్నారు. ఉదాహరణ చెక్కు బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా, పరిహారం పై జాతీయ లోక్ అధాలత్ అవార్డ్ జారీ చేయ్యావచ్చునని అన్నారు. పైన పేర్కొన్న వాటిని ఈ కోర్టు ద్వారా విచారణ ,అప్పీల్ లో ఉన్న కేసు లకు సంబంధించిన రాజీ పడితే, యదార్థం లోకి వెళ్ళ గలిగితే అన్ని తగాదాలకు పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు.
పరిష్కారం అయినవాటిలో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం ద్వారా :
వాహన ప్రమాదం ఘటన లో కాట్రేనికొన చెందిన వ్యక్తులు మృతి చెందిన ఘటన లో వారి కుటుంబ సభ్యులైన బల్లిపాటి సుధా మరియు ముగ్గురు కుటుంబ సభ్యులు వెర్సెస్ యూ. వెంకన్న తదితరులు 8 వ అదనపు జిల్లా జడ్జి బెంచ్ వారి వద్ద పరస్పర అంగీకారంతో రాజీకి రావడం తో రూ.83 లక్షల కు పరిహారం నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
దేవగుప్తాం కి చెందిన తానెలంక రాజేష్ వెర్సెస్ ప్రత్తిపాడు కు చెందిన కడియాల చక్రవర్తి తదితరులు 5 వ అదనపు జిల్లా జడ్జి బెంచ్ లో రు.15 లక్షల పరిహారం తో ఇరు పార్టీలు రాజీ కుదుర్చుకున్నారు.
జిల్లాలో కేసులు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ లు, పోలీస్, ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల సహకారంతో జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ను చక్కగా నిర్వహించడం సాధ్యం అయిందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని 15 కోర్టు లలో ఏర్పాటు చేసిన 45 బెంచ్ ల ద్వారా సుమారు 23,554 వేల కేసులు పరిష్కారం కోసం జాతీయ లోక్ అధాలత్ నిర్వహించి తీర్పులు వెలువరించి నట్లు పేర్కొన్నారు.
5వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. విజయ్ గౌతమ్, 10 వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. నాగేశ్వరరావు, సీనియర్ జిల్లా జడ్జి కె.ప్రత్యూష కుమారి, డిఎల్ఎస్ఎ సెక్రటరీ , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐ.శివప్రసాద్, న్యాయవాది జి. వంశీమోహన్ తదితరులు పాల్గొన్నారు.