Breaking News

ధృఢమైన భరత జాతి ‘నిర్మాణం’లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కీలకం…

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-లైమ్ స్టోన్ , మైనింగ్ లీజ్ లకు సంబంధించిన ఎంఎండీఆర్ పాలసీలో మార్పులకు బుగ్గన సూచన
-పాణ్యం సిమెంట్స్ అండ్ మినరల్ ఇండస్ట్రీ గురించి మంత్రి ప్రస్తావన
-ప్రత్యేకాకర్షణగా ‘ఐసీఎల్’ 75 సంవత్సరాల ప్రయాణంపై రూపొందించిన వీడియో
-ఆర్థిక మంత్రి బుగ్గనకు జ్ఞాపికను అందజేసిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ డైరెక్టర్ రూప గురునాథ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లైమ్ స్టోన్ , మైనింగ్ లీజ్ లకు సంబంధించి కేంద్రం ఎంఎండీఆర్ పాలసీలో స్వల్ప మార్పులు చేపడితే మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సూచించారు. తన సొంత జిల్లా కర్నూలులో మంత్రి బుగ్గన తాత సహ వ్యవస్థాపకులుగా 1956లో ప్రారంభమైన పాణ్యం సిమెంట్స్ అండ్ మినరల్ పరిశ్రమ కోసం ఆనాడు డెన్మార్మ్, జర్మనీ నుంచి తెచ్చిన కీమ్ ఖనిజం గురించి ఆయన జ్ఞప్తి చేసుకున్నారు. ఇటీవల ఏపీలో రామ్ కో సిమెంట్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక విధానమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ముఖ్యమంత్రి తానే స్వయంగా చెప్పి భరోసానిచ్చిన విధాన్ని మంత్రి ప్రస్తావించారు. ధృఢమైన భరత జాతి ‘నిర్మాణం’లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కీలకంగా భాగస్వామ్యమైందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సిమెంట్ పరిశ్రమ ఐసీఎల్ అని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పర్యటిస్తుండడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఐసీఎల్ ప్లాటినం జూబ్లీ వేడుకల కార్యక్రమంలో మంత్రి పేర్కొన్నారు.

శంకర్ లింగ్ అయ్యర్, నారాయణ స్వామిల వ్యవస్థాపక అధ్యక్షులుగా 1946లో మొదలైన ఐసీఎల్ ప్రయాణం నేటికీ విజయవంతంగా కొనసాగడం వారి విజన్ కి నిదర్శనమన్నారు. 1.3 మిలియన్ టన్నులతో మొదలై 6 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరడం ఎన్.శ్రీనివాసన్ సారథ్యంలోని ఐసీఎల్ గ్రూప్ కృషి, అంకితభావానికి తార్కాణంగా మంత్రి తెలిపారు. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ గోల్డెన్ జూబిలీ వేడుకల సందర్భంగా రూపొందించిన వాణిజ్య ప్రకటన గురించి మంత్రి బుగ్గన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జెఎన్ టాటా లండన్ పర్యటించినపుడు బ్రిటీష్ రైల్వే అధ్యక్షుడితో టాటా మాట్లాడిన మాటలతో రూపొందించిన ఆ వాణిజ్య ప్రకటన ప్రత్యేకతను తెలిపారు. శంకర్ సిమెంట్స్, కోరమాండల్ సిమెంట్స్, రాశి సిమెంట్స్ , చెన్నై సూపర్ కింగ్స్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసన్ సాధించిన ఘన విజయాలుగా బుగ్గన అభిప్రాయం వ్యక్తం చేశారు. వేస్ట్ హీట్ రికవరీ సిస్టం, విండ్ పవర్ , కోల్ మైన్స్ వంటి రంగాలలోనూ సత్తా చాటుతుందన్నారు. 2047 పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంతో ప్రధాని మోదీ నాయకత్వంలో స్వదేశీ ఉత్పత్తి రంగంలో చిరునామాగా నిలిచే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోని నాలుగు అగ్రదేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు. రూ.లక్ష కోట్లు మౌలిక వసతుల కల్పన కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండడమే అందుకు నిదర్శనమన్నారు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ఆర్థిక మంత్రి బుగ్గన మర్యాదపూర్వకంగా కలిశారు. సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో తన శైలి ప్రత్యేకమని మంత్రి బుగ్గన ధోనిని ప్రశంసించారు. ‘ఐసీఎల్’ 75 సంవత్సరాల ప్రయాణంపై రూపొందించిన వీడియో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రారంభానికి ముందు ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ఎల్.మురుగన్ లతోనూ మంత్రి సమావేశమయ్యారు.

చెన్నైలోని కలైవనార్ అరంగం వేదికగా జరిగిన ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ప్లాటినం జూబిలీ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సహా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక సహాయ శాఖ మంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గోవా ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రి సుభాష్ శిరోత్కర్ ఇండియా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, పార్లమెంట్ సభ్యులు, సిమెంట్స్ లిమిటెడ్ రూప గురునాథ్ తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *