విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ” మైన్ డైమండ్స్ ” షోని విజయవాడ షోరూంలో ప్రారంభించారు. శనివారం బందర్ రోడ్డులోని మలబార్ గోల్డ్ & డైమండ్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి ప్రశాంతి పాల్గొని వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మరియు మలబార్ గోల్డ్ డైమండ్ షోని & డైమండ్స్ ప్రతిని ధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు , లైట్ వెయిట్ ఆభరణాలు , పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ విజయవాడ షోరూంలో నవంబర్ 12 , 2022 నుండి నవంబర్ 19 వరకు , 2022 ఈ డైమండ్ షో కొనసాగుతుంది అని షోరూం హెడ్ నిఖిల్ చంద్రన్ తెలియజేసారు. 22 కారెట్ల పాత బంగారం మార్పిడి పై 0 % తగ్గింపును పొందండి. మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాలు రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు లభిస్తాయి అని తెలిపారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …