తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు ఈ నెల 14 నుండి 17 వరకు తిరుపతి తిరుమల లో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ శాఖా మంత్రి ఈ నెల 14వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుండి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన బయల్దేరి రాత్రి 10 గంటలకు తిరుమల చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని సాయంత్రం 3:30 గంటలకు తిరుమల నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 4.30 కు తిరుపతి చేరుకుని హోటల్ గ్రాండ్ రిడ్జ్ నందు రాత్రి బస చేస్తారు. 16వ తేదీ ఉదయం 10:30 కు స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని పి ఎల్ ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాయలసీమ జిల్లాల రెవెన్యూ కాన్ఫరెన్స్ నందు సాయంత్రం 5.15 వరకు పాల్గొని గ్రాండ్ రిడ్జ్ నందు రాత్రి బస చేసి మరుసటి రోజు 17వ తేదీ ఉదయం 7:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి విశాఖపట్నం నకు తిరుగు ప్రయాణం కానున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …