విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ 55 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎమరాల్డ్ జూబిలీ సంవత్సర వేడుకలలో భాగంగా సాధారణంగా చేసే సేవా కార్యక్రమాలతోపాటు మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాసవీ మహిళా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్నర్ నీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ కన్వీనర్ జి.రష్మి మాట్లాడుతూ ఎమరాల్డ్ జూబిలీ సంవత్సర వేడుకలలో భాగంగా ఎమరాల్డ్ రూఫ్ సోలార్ ప్లాంట్ కామారులోని వాసన్య బాలికల వసతి గృహం దాతల సహకారంతో 10 లక్షల విలువైన రూఫ్ సోలార్ ప్లాంట్‌ను అంతర్జాతీయ ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు జునైడా ఫార్కన్ చేతుల మీదుగా నవంబరు 15వ తారీకు సాయంత్రం 4 గంటలకు. ప్రారంభము జరుగుతుందన్నారు. వసతి గృహానికి వెయింటింగ్, విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కంటిన్యూస్ ప్రాజెక్ట్ గా చేస్తున్నామన్నారు. ‘నో యువర్ నంబర్స్’ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ డిసీజెస్ పై అవగాహన పెంపొందించి ప్రజలందరికి వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ పై చైతన్యము అందించడానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌తో ఒప్పందం చేసుకుని రక్తపోటు, మధుమేహం మొదలగు పరీక్షలు. చేయించి వ్యక్తిగత ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి క్యాంప్స్ నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. ‘మహిళా ఉత్సవ్’లో భాగంగా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయుటకు వ్యాపారం చేయుటకు వర్క్‌షాప్స్‌లు నిర్వహించి స్వయం శక్తితో ప్రతిభ చూపించిన మహిళలకు సత్కరిస్తామన్నారు. కిడ్నీ ఇబ్బందులపడే వారికి అవగాహన, పోలియో ప్లస్ కార్యక్రమంతోపాటు మహిళలు, బాల బాలికలు, యువత, వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన అనేక సహాయ కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ సమాజ ప్రగతికి నిస్వార్థ సేవలందించేందుకు మరిన్ని ప్రాజెక్ట్‌లు చేసేందుకు తమకు సహకరిస్తున్న దాతల ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మార్గరెట్ గోల్డింగ్ అవార్డును ఇన్నర్ వీల్ క్లబ్ అఫ్ విజయవాడ పాస్ట్ ప్రెసిడెంట్ పి.డి.సి జి.రశ్మికి ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పిడిసి సకల నియంత, ప్రెసిడెంట్ కిరణ్మయ్, సెక్రటరీ పద్మావతి, పిపి బి.సుజాత, ప్రాజెక్ట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …