Breaking News

బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎంపి మార్గని భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల్లో ఉన్న సృనాత్మకతను గుర్తించి ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు తగిన విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత , ఎంపి మార్గని భరత్ రామ్ లు అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవం కు ముఖ్య అతిథిగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తొలుత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి స్కూల్ లోనూ పిల్లలకు ఆటపాటలు, క్రీడలను నిర్వహించి వారిలో ఆలోచన కలుగచేసే విధంగా ప్రేరణ కలుగ చెయ్యాలని స్పష్టం చేశారు. మీలో ఎంతమంది ఆటలు ఆడరు అనగా ఇద్దరు ముగ్గురు పిల్లలు చేతులెత్తగా, ఎందరు ఆడారు అనగా పిల్లలందరూ చేతులెత్తడం పై కలెక్టర్ స్పందిస్తూ, ఇది అతిశయోక్తి గా ఉందని అన్నారు. నేడు సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి అయినా క్రీడలను, విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ఒక గంట పుస్తక పఠనం పట్ల ఆసక్తి చూపని పిల్లలు గంటల గంటలు సెల్ ఫోన్లు, టివి లకు అతుక్కుని పోతుండడం చూస్తున్నా మన్నారు. పిల్లలు కొద్దిపాటి శ్రద్ద పెట్టగలిగితే అద్భుతాలు సృష్టిస్తారని మాధవీలత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు పుట్టక ముందు నుంచి చదువుకునే వరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగులు వేయడం జరుగుతోందన్నారు. గర్భస్త శిశువు నుంచి బడి ఈడు పిల్లలు వరకు ప్రతి అడుగులో జగనన్న తోడుగా నిలుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మన దేశ భవి భారత పౌరులను తీర్చి దిద్దడం లో మన ముఖ్యమంత్రి అడుగులు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

పిల్లలు చిన్ననాటి నుంచే ఇక లక్ష్యం, దృఢ సంకల్పం తో ఉంటే ఏదైనా సాధించ గలుగుతారని ముఖ్య అతిధి పార్లమెంట్ సభ్యులు మార్గనీ భరత్ రామ్ అన్నారు. పిల్లలందరూ ముఖ్యమంత్రిని మేన మామ గా పిలుస్తున్న సందర్భం కేవలం ఇక్కడే చూస్తున్నామని, తన సొంత పిల్లలను ఎలా చూడాలో అదేవిధంగా జగనన్న చూసుకుంటున్నారని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ చేస్తాన్నానన్నారు. ఆట పాటలతో పిల్లలలో వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తుందని అన్నారు.

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, పిల్లలు చిన్నప్పటి నుంచి క్విజ్ , వ్యాసరచన పోటీలు లో పాల్గొని వారిలోని సృజనాత్మకతను పెంపొందించు కోవలసి ఉందన్నారు. పిల్లలు మాటల్లోంచి వొచ్చిన జగన్ మామయ్య అనే పదం వారి గుండె లోతుల్లోంచి వచ్చిందనడం లో ఎటువంటి సందేహం లేదన్నారు. పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు, ఇంత మంచిగా పౌష్టికాహరాన్ని అందించిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం వివిధ పోటీల్లో పాల్గొని విజేతలైన పిల్లలకు బహుమతి ప్రధానం ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందచేశారు.

ఈ వేడుకల్లో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ , జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె. విజయ కుమారి, డి ఈ ఓ ఎస్. అబ్రహం, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ బి. శ్రీనివాస రావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, వరల్డ్ విజన్ కో ఆర్డినేటర్, పుల్లయ్య,భూమిక హెల్ప్ లైన్ కౌన్సిలర్, అప్పాయమ్మ, ఎన్. శ్రీనివాస్, పలు స్కూల్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *