విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ శతక జయంతి ఉత్సవాల్లో భాగంగా TNSF జిల్లా ప్రధాన కార్యదర్శి పులగూర చరణ్ సాయి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VPL-2022 క్రికెట్ టోర్నమెంట్ సోమవారం రైల్వే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ని ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొండా ఉమామహేశ్వరరావు, ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూTNSF ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడు క్రీడలకు,క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం సహకారాలు అందించేవారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి క్రీడలను, క్రీడాకారులను పట్టించుకోవట్లేదు అటువంటి పరిస్థితుల్లో TNSF NTR జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర ఆర్గనైజ్ కార్యదర్శి పత్రి రాఘవ చరణ్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గరిమెళ్ళ సాయి తేజ, అధికార ప్రతినిధి బుగత రాజశేఖర్,సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు శంకర మనోజ్ కుమార్, మనీష్ వర్మ, శ్రీకాంత్, అఖిల్, రాహుల్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …