-MLA అన్నాబత్తుని శివకుమార్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి విద్యార్థులకు చైతన్యంతో సంస్కారవంతమైన విద్య అవసరం ఉందని శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పండిట్ నెహ్రూ చాచా 133వ జయంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 14, 15 తేదీలలో జరుగుచున్న International Children Film Festival కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు మంచి క్రమశిక్షణ, తల్లి దండ్రులు గురువులపై గౌరవం ఉంటే వారు భవిష్యత్తు లో తమదైన వృత్తిలో ఉజ్వలంగా రాణిస్తారన్నాని, వారు అంటే తల్లి దండ్రులు టీచర్ల తమ భవిష్యత్ కోసం కఠినంగా ఉంటారన్నది గ్రహించాలన్నారు. తెనాలి ప్రథమ పౌరురాలు ఛైర్మన్ ఖాలేదానశీం మాట్లాడుతూ వర్తమాన సమాజంలో పిల్లల ఎదర్కొంటున్న సమస్యలూ చలన చిత్రోత్సవంలో ప్రతిబింబించేలా చిత్రాలు తీయాలని నిర్వాహకులు వాటిని ప్రదర్శించాలన్నారు. వివేక విద్యాసంస్థల అథినేత రావి వీరనారాయణ చక్కని సమన్వయంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో వర్థమాన నటుడు ప్రేమ్ సాగర్ , చిత్రదర్శకలు చిత్తరంజన్ సురేష్ , బాల నటుడు భానప్రకాష్, బొల్లిముంత కష్ణ పాల్గొన్నారు.