విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం ఫోరం ఫర్ చైల్డ్ లైన్ వారు కేర్ & షేర్ బాలబాలికలతో నగర పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.ని కలిసి ఆపదలో వున్న బాలల సంరక్షణలో పోలీస్ శాఖ తరుపున బాధ్యత తీసుకుని చక్కని సహకారం అందిస్తున్నందుకు నగర పోలీస్ కమీషనర్ కి కృతజ్ఞతలుతెలుపుతూ సురక్షా బంధన్ కట్టారు.అనంతరం నగర పోలీస్ కమీషనర్ బాలబాలికలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరికీ బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫోరం ఫర్ చైల్డ్ లైన్, అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థల సహాయ సహకారంతో వారం రోజుల పాటు బాలల హక్కులపై ప్రజల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని, ఈ అవగాహన, చైతన్య కార్యక్రమాలలో పోలీస్ వారు కూడా తమ వంతు సహాయం అందిస్తారని తెలియజేసారు. అంతే కాకుండా పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వచ్చిన పిల్లలందరికీ బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రిఫ్రెష్మెంట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమీషనర్లు విశాల్ గున్ని ఐ.పి.ఎస్., మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్., చైల్డ్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఆరవ రమేష్ , సెంటర్ కో ఆర్డినేటర్ నాగరాజు, కేర్ & షేర్ ప్రాజెక్ట్ మేనేజర్ పి.రత్నం , చైల్డ్ లైన్ సిబ్బంది మరియు కేర్ & షేర్ బాలబాలికలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …