విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన మంచి మనిషి కృష్ణ అని ఆయన లేరనే వార్త నమ్మలేకున్నాం అని, ఆయన మరణవార్త తనను కలచివేసింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ – తెలుగు సినీ ప్రపంచంలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది అని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురుని ఆదుకున్న మంచి మనసున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు అని, ఆప్యాయంగా పలకరించే వ్యక్తిని కోల్పోవడం బాధాకరం.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని అవినాష్ తెలియజేసారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …