విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓమ్ కార్యాలయము లో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సందర్భంగ నిర్వహించిన ఆక్యుపంక్చర్ జాతీయ సదస్సులో పాల్గొన్న వక్తలు భవిష్యత్తు అంతా ఆక్యుపంక్చర్ సైన్స్ దే అని నిర్ణయించారు. చెన్నై కి చెందిన డాక్టర్ అగత్యార్ మాట్లాడుతూ అతి చవక అయిన సురక్షితమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఆక్యుపంక్చర్ భవిష్యత్తు కి ప్రధాన ఆరోగ్య విధానముగా ఏర్పడనునదని తెలిపారు. కోయంబత్తూర్ కి చెందిన శ్రీ కుమార్ ఉన్ని మాట్లాడుతూ బాడీ లోని వ్యర్ధాలను ఆక్యుపంక్చర్ సైన్స్ ద్వార సులభముగా తగ్గించుకోవచ్చు అన్నారు. భద్రాచలంకు చెందిన డాక్టర్ అలవాల రవి మాట్లాడుతూ ఆరక్యులర్ థెరపీ తో ఆరోగ్యాని అతి తేలికగా పొందవచ్చు అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ గవర్నమెంట్ ఆయుర్వేదం కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్ మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ సైన్స్ ఆయుర్వేద వైద్యానికి దగ్గరగా ఉంటాయి అని కలిసి పని చేస్తే సత్ఫలితాలు త్వరగా పొందవచ్చు అన్నారు. గుడివాడ కు చెందిన హోమియో సైంటిస్ట్ డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గా హోమియో, యోగా ప్రాజెక్ట్ ను క్షణముగా పరిశీలించిన తర్వాత ఆక్యుపంక్చర్ ప్రాక్టీషణర్స్ హోమియో కూడా నేర్చుకుని పనిచేయటానికి తమ సంస్ధ ఇతోధికంగ పని చేస్తుందన్నారు. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సునీత వేడి చలువ తత్వాల ఆరోగ్యం పై ప్రభావము ఉన్నాయని విశదీకరించారు. వరంగల్ కు చెందిన డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యమ్ పై పంచ భుతాల ప్రభావము ఉందని ఆక్యుపంక్చర్ ద్వార పంచ భూతాలను తేలికగా సమన్వయ పరచవచ్చు అన్నారు. తిరుపతి కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యం పై గ్రహాల స్థితినీ తెలిపి సరి చేసుకోడానికి ఆక్యుపంక్చర్ ఏ విధముగా ఉపయోగపడుతుందో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి నిర్వహించిన డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ ఆక్యుపంచరిస్టులకి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆస్పా ఇండియా ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి తెలిపారు. దేశంలో ఆక్యుపంక్చర్ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి నేషనల్ అవార్డులు అందజేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …