విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రజాభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొంటూ తూర్పు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి ఆధ్వర్యంలో 25వ సచివాలయ పరిధిలోని కార్మిక నగర్ కొండ లైబ్రరీ,మారుతి గ్రాండ్, మోడల్ డైరీ ప్రాంతాలలో ఇంటింటికి పర్యటించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి,ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు వారిలాగా జన్మభూమి కమిటీలను పెట్టి వారికి అనుకూలమైన వారికి మాత్రమే మొఖాలు చూసి పెన్షన్ ఇచ్చేవారు అని, జన్మభూమి కమిటీ పేరుతో అన్యాయంగా ప్రజల సొమ్మును మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచి పెట్టారని ఆరోపించారు. అలాగే గతంలో ప్రజాప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్ల కోసం వెళ్లే ముందుకు వచ్చేవారు.. కానీ ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెళుతున్నామని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రజల సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమేనని అన్నారు. గత 15రోజులుగా ఈ డివిజన్ లో కొండంచున ఉన్న చివరి ఇంటి వరకు ప్రతి కుటుంబాన్ని కలవడం జరిగిందని,ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పనితీరు పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మెట్ల మార్గాలు, డ్రైనేజ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు.ప్రభుత్వాన్ని ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే ఈ ప్రతిపక్ష నేతలు ప్రజలకు మంచి జరుగుతుంటే చూసి వారు లేక ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అందించిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం లేదన్నారు.2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేలా ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన ఆంధ్ర రాష్టంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని అది ప్రజలకు చేరేందుకే సచివాలయం అధికారులు వాలంటీర్లు ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల అందజేయడం జరుగుతుందన్నారు. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో అవినాష్ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.ప్రజలకు సుపరిపాలన అందించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి,వైస్సార్సీపీ నాయకులు రవి ప్రకాష్,చందా కిరణ్,ఆనంద్, గిరి, రమేష్, సత్యనారాయణ, పండు, రవి, సుధీర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు దేవినేని నెహ్రూ నగర్ నివాసి సత్యనారాయణ తన అనారోగ్యం గురుంచి తెలుపగ వారికి తక్షణ వైద్య చికిత్స కొరకు 5000, మసీదు స్ట్రీట్ కు చెందిన జెన్నీబీ కి ఇంటి నిర్మాణ ఖర్చులకు 3000, పేదరికంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న మసీదు స్ట్రీట్ కు చెందిన సుగుణమ్మ కు నెలవారీ సరకులు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ఛైర్మెన్ దేవినేని అవినాష్ అందజేశారు.