Breaking News

సురక్షితమైన నీటిని వినియోగించేలా ప్రజలలో అవగాహన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి కాలుష్యని నివారించి సురక్షితమైన నీటిని వినియోగించేలా ప్రజలలో అవగాహన కల్పించేందుకు విసృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జల జీవన్‌ మిషన్‌ టాటా ట్రాస్ట్‌ విజయ వాహిణీ ఫౌండేషన్‌ సంముక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని పార్చూన్‌ మురళి హోటల్‌ నందు వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ మరియు సర్వేలెన్స్‌ గ్రే వాటర్‌ నిర్వహణపై నిర్వహించిన వర్క్‌ షాప్‌కు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై జ్వోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వాటర్‌ ఎ లగ్జరీ ఆఫ్‌ లైఫ్‌ అనే సివి రామన్‌ సూక్తిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. త్రాగు నీరు కనిపించే దైవం అని మంచి నీటికి మించిన మందు మరియెకటి లేదన్నారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో ఎరువులు పురుగుమందులు రసాయనక పదార్థలు అవసరాలకు మించి వినియోగిస్తున్నారన్నారు. సాగునీరుతో పాటు ప్రజలు గృహాలలో వినియోగించిన నీటిని టాయిలెట్స్‌ వ్యర్థలతో కలిసిన నీటిని సమీపంలోని డ్రైనేజిలు, కాలువల ద్వారా నదులు సముద్రాలలో కలవడం వలన నీరు కలుషితమవుతుందన్నారు. 70 నుండి 80 శాతం ప్రజలు కలుషితమైన త్రాగునీరు, అపరిశుభ్రతవలన రోగాల బారిన పడి మరణిస్తున్నారన్నారు. టర్బిడిటీ ఫ్లోరైడ్‌ నైట్రేట్‌ వంటి వాటి వలన నీరు కలుషితం అవుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు సాధారణ నీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగిస్తారన్నారు . ప్రజలు ఉపయోగించే త్రాగునీటిని తనిఖీ చేసి నిర్థిష్టమైన ప్రమాణాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రిపోర్టలను గ్రామ సచివాలయల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి కూళాయి పథకం కింద సురక్షితమైన త్రాగునీటిని జల జీవన్‌ మిషన్‌ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా చర్యలుతీసుకునే భాధ్యత ప్రభుత్వ అధికారులే కాక స్వచ్చంద సంస్థలపై కూడా ఉందన్నారు. పరిమితంగా నీటిని వాడేలా ప్రజలను చైతన్యవంతులు చేయాలని రెయిన్‌ వాటర్‌, రూఫ్‌ వాటర్‌లను హర్‌వెస్టింగ్‌ చేయాలన్నారు. గ్రే వాటర్‌ నిర్వహణ కోసం సోక్‌ పిట్స్‌ లీచ్‌ పిట్స్‌ కిచెన్‌ గార్డెన్స్‌ వంటి వాటర్‌ ట్రీటిమెంట్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. భవన నిర్మాణాల నియమాల ప్రకారం ఎస్టీపిల ఏర్పాటు తప్పని సరి చేయాలన్నారు. తక్కువ ఖర్చుతో వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు.
కార్యక్రమంలో టాటాట్రాస్ట్‌ ప్రతినిధులు దివ్యాంగ్‌ వాఘేలా, ఆర్‌ రాజేంద్ర, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఛీప్‌ ఇంజనీయర్‌ హరి రామ్‌ నాయక్‌, ఎస్‌సి వెంకటరమణ, విజయ వాహిణీ ఫౌండేషన్‌ ప్రతినిధి మనోజ్‌, వివియన్‌ విశ్వాస్‌ అరుల్‌, జల జీవన్‌ మిషన్‌ అధికారులు, వివిధ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *