విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు-నేడు రెండవ దశ పనులను జాప్యం లేకుండా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డిల్లీరావు నాడు-నేడు రెండవ దశ పనులు, జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు, స్పందన అర్జీలు, తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడివోలు, తహాసిల్దార్లు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులతో మండలస్థాయి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో దశ నాడు-నేడు పనులను 17 మండలాల్లో 598 పాఠశాలలో అభివృద్ధి పనులతతో పాటు 578 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. వీటితో పాటు 9 జూనియర్ కళాశాలలో చేపట్టిన పనులను సమీక్షించారు. పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరెట్ స్థాయిలో తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు`నేడు పనులను అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో అదనపు తరగతి గదులు, ప్రహరి గోడ, నీటి సరఫరాతో మరుగుదొడ్ల నిర్మాణం, మేజర్ మైనర్ రిపేర్లు, విద్యుత్, త్రాగునీరు, తదితరు పనులను చేపడుతున్నామన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని పనుల్లో పురోగతి చూపాలన్నారు. ఎంపీడీవోలు సంబంధిత మండలాల్లోని ఎంఈఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వారం వారీగా పనుల ప్రగతిని సమీక్షించుకోవాలని అన్నారు. డిస్ట్రిక్ట్ మానిటరింగ్ యూనిట్ యూక్టివ్‌గా పని చేయాలన్నారు. మండలాల వారిగా జరుగుతున్న పనులను పరిశీలించుకొని తక్కువ ప్రగతి ఉన్నచోట్ల తగిన కారణాలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. గ్రౌండ్ అయిన వాటికి స్టేజ్ అప్డేషన్ ఉండాలన్నారు. రోజువారి పనులు ప్రగతిని యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పనులలో జాప్యం లేకుండా ఇసుక, సిమెంట్ కొరత లేకుండా చూడాలన్నారు. పనుల ప్రగతిలో జిల్లా ను రాష్ట్రంలోనే మెదటి స్థానంలో నిలిపేలా అధికారులు ప్రగతి చూపాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
జగన్న కాలనీ గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి.
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలో గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ డిల్లీరావు మండల వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
గృహప్రవేశాలకు సిద్దం చేయవలసిన 12,264 నిర్మాణాలను గాను 4,492 గృహాలు నేటి వరకు పూర్తికాగా మిగిలిన 7,772 గృహాల పనుల ప్రగతిని సమీక్షించారు. రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న 2,295 గృహాలు, బేస్మెంట్ స్థాయిలో ఉన్న 1,837 గృహాలు, రూప్ కాస్టింగ్ స్థాయిలోని 3,440 గృహాలు మొత్తంగా 7,772 గృహాలను త్వరితంగా పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు.
స్పందనలో నమోదు అవుతున్న ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు గడువులోగా పరిష్కారించాలన్నారు. అర్జీలు ఏ స్థాయిలోను పెండిరగ్ లేకుండా పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కాన్ఫెరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, డిఇవో సివి రేణుక, హౌసింగ్ పిడి శ్రీదేవి, గ్రామ వార్డు సచివాయ జిల్లా అధికారి కె. అనురాధ, మండల స్ఫెషల్ ఆఫీసర్లు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …