-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు ఆపద సమయాలలో ప్రజలకు సేవలందించడంలో ముందుటున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి అందిస్తున్న సేవలలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యులు కావాడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు మైలవరం మండల ప్రజా పరిషత్ అధికారి సిబ్బంది మరియు మండలంలోని సచివాలయాల సిబ్బంది స్పందించి 86 వేల రూపాలయను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు ఆపదలు సంభవించిన సమయాలలో ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరుపున కొంత మేర ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు వారికి తోచిన విధంగా రెడ్‌క్రాస్ సొసైటికి ఆర్ధిక సహాయం అందించాలని కోరామన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి సేవలలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన మైలవరం యంపిడివో మరియు కార్యలయ సిబ్బందితో పాటు మండలంలోని 17 సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది 86 వేల రూపాయలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి సభ్యత్వం రూపంలో అందించడం పట్ల అభినందనాలు తెలియజేస్తున్నానన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి భవిష్యత్‌లో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగాస్వామ్యులయ్యేందుకు వీరు అందించిన సహకారం స్పూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కు ఆర్థిక సహాయం అందించిన వారిలో మైలవరం యంపిడివో బి.యం లక్ష్మీకుమారి, సూపరింటెండెంట్ ఏవి రమణ, మైలవరం వెల్వడం గ్రామ సెక్రటరీలు, సాంబశివరావు, కోటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.