Breaking News

ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీక్షా విరమణలను విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని శాఖల సమన్వయంతో భవానీ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీక్షా విరమణలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో భవానీ దీక్షా విరమణకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై బుధవారం దేవాదాయ , రెవెన్యూ, పోలీస్‌, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, మత్స్యశాఖల అధికారులతో సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 15వ తేది నుండి 19వ తేది వరకు భవానీ దీక్షా విరమణలకు భవానీ భక్తులు రోజుకు సుమారు 50 వేల నుండి 1లక్ష లోపు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. డిసెంబర్‌ 16వ తేదీ శుక్రవారం, 18వ తేదీ ఆదివారం రోజులలో 1లక్షకు పైగా భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబర్‌ 12వ తేది సాయంత్రానికి లేదా 13వ తేదినకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలన్నారు. దసరా ఉత్సవాలలోను విజయవంతం చేసిన తరహలో ఈ ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ మార్గంలో వాటర్‌ ఫ్రూప్‌ షామియానాలు, కోయిర్‌ మ్యాట్లు, తాత్కాలిక విద్యుత్‌ అలంకరణ, త్రాగునీరు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు చేయాలన్నారు. పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం ద్వారా భక్తులకు నిరంతరం సూచనలు అందించాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. గత సంవత్సరం కంటే భవానీలు భక్తులు ఈ ఏడాది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున స్థాన్నాలు, గిరి ప్రదర్శన, అమ్మవారి దర్శనం, హోమ గుండం ఏర్పాట్లు, ఇరుముళ్ల విరమరణ, ప్రసాదం సరఫరా, ఎర్ర బట్టలు వదిలే ప్రాంతాలలో ఏర్పాట్లును చేయాలన్నారు. ఇరుముళ్లను గురు భవానీలు విరమించడమా పూజార్లు విరమించడమా అనే అంశాలపై మరొకసారి చర్చించాలన్నారు. గిరి ప్రదర్శనలో భాగంగా రోడ్లను శుభ్రంగా ఉంచాలని హోమ గుండం ఏర్పాట్లలో రెండు చోట్ల కంటే మరొకటి ఏర్పాటు చేయటానికి పరిశీలించాలన్నారు. ఆరోగ్యకేంద్రాలు 20 ఏర్పాటు చేయాలని సిబ్బంది అవసరమైతే ప్రైవేటు సంస్థలను సమన్వయం చేసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు డియంహెచ్‌వోకు ఆదేశించారు.
డిసిపి కోల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భవానీ దీక్షా విరమరణ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి 2 వేల సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తామన్నారు.
ఆలయ ఇవో భ్రమరాంబ మాట్లాడుతూ భవానీలకు అమ్మవారిని దర్శించేందుకు ఉచిత దర్శనం ఉంటుందని , ఇతరులకు 200/`, 300/`, 500/` టిక్కెట్‌ దర్శనం ఉంటుందన్నారు. గత సంవత్సరంలో హోమగుండాలు రెండు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పరిశీలన అనంతరం మరొక హోమగుండం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, అడిషినల్‌ డిసిపి సర్కార్‌, ఎసిపి హనుమతురావు, డియంహెచ్‌వో యం సుహాసిని, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌, నగరపాలక సంస్థ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *