విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహుళ ప్రయోజన కేంద్రాల (మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు) నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీ రావు అధ్యక్షతన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల నిర్మాణాలపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాతలకు అన్ని విధాల అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాల వద్ద బహుళ ప్రయోజన కేంద్రాలు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ద్వారారైతులకు 15 రకాల మౌలిక సదుపాయాలు సమకూరతాయన్నారు. చేపట్టిన నిర్మాణాలు నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలన్నారు, మొదటి దశలో జిల్లాలో చేపట్టిన 50 గొడౌన్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిర్మాణాలు పూర్తయిన సొసైటీలకు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామన్నారు. మొదటి విడత 40 లక్షల రూపాయలను నిర్మాణాలు పూర్తయిన ఆయా సొసైటీలకు చెల్లించామని, రెండో దశలో 27 లక్షల రూపాయల బిల్లుల చెల్లింపునకు నేటి సమావేశంలో ఆమోదం తెలిపామన్నారు. రెండో విడత నిర్మాణాలు పూర్తయిన తిరువూరు డివిజన్ లోని పోలిశెట్టిపాడు, మల్లెల, కంభంపాడు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, జి కొండూరు మండలం వెల్లటూరు సొసైటీలకు 27 లక్షల రూపాయల బిల్లుల చెల్లింపులను ఆమోదించామని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ సిహెచ్. శైలజ, మార్కెటింగ్ ఏడి కిషోర్, డీసీసీబీ, డిఇ ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …