Breaking News

నగరంలో లారీస్ ఓవర్సీస్ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అబ్రాడ్ లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలను అందించడానికి నగరంలో లారీస్ ఓవర్సీస్ ప్రారంభించబడింది. గురువారం బందర్ రోడ్ లోని ఏర్పాటుచేసిన లారీస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు యలమంచిలి రవి, జివిఎల్ నరసింహారావు, చందు సాంబశివరావు, బబ్బురి శ్రీరామ్, అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితులలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్దులకు లారీస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఇచ్చే సహాయ సహకారాలను అభినందించారు. దీనివలన వారి భవిష్యత్‌ ఉన్నతికి దోహదపడుతుందన్నారు. అబ్రాడ్ లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అబ్రాడ్ లో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని మరియు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయని అన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు యుఎస్ఎలో ఉన్నత విద్యకు మంచి అవకాశం ఉందని, విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత వారికి ఉద్యోగ అవాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు విదేశీ చదువు కోసం సరైన కన్సల్టెన్సీ ని సంప్రదించడం తెలియక వారు చెప్పే అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోయి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఎంతో అనుభవంతో పాటు సేవా దృక్పథం కలిగిన లారీస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ లాంటివి నగరంలో ప్రారంభించడం విదేశీ విద్య చదివే విద్యార్థులకు శుభసూచకమని నిర్వాహకుల ను అభినందించారు. సంస్థ నిర్వాహకులు వీరమాచినేని కిరణ్, సృజన కుమార్ లు మాట్లాడుతూ ఆర్థిక అవరోధాలు, సరైన మార్గదర్శకత్వం లేని కారణంగా ఎంతో మంది తెలివైన విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించలేకపోతున్నారని, వారి కలను నెరవేర్చడానికి లాభాపేక్షలేకుండా మావంతు సహాయ సహకారాలు అందజేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం విద్యాసంస్థలలో స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ప్లేస్‌మెంట్లు మరియు పిఆర్‌లను పొందడం కోసం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక రాయితీ లు అందజేస్తున్నామన్నారు. తమ సంస్థ ఎబ్రాడ్‌, యూకె, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, కెనడా, యూరప్ లలో ప్రముఖ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. హైదరాబాదు, రెండో బ్రాంచ్ ఇప్పుడు విజయవాడలో ప్రారంభించామన్నారు. భవిష్యత్‌లో కాకినాడ, తిరుపతి, విశాఖ లలో బ్రాంచ్‌లు స్థాపించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖు లు, రాజకీయ నాయకులతో పాటు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *