విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి పెడుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్‌కు వివవరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు, జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష, రీసర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామి, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో కమీషనర్ కోన శశిధర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాల నిర్మాణాలకు గాను, 120 సచివాలయాలను పూర్తి చేశారమని మరొ 139 సచివాలయాల నిర్మాణం తుది దశలో ఉన్నాయన్నారు. 260 రైతు భరోసా కేంద్రాలకు గాను 60కి పైగా భవనాలను పూర్తి చేశామని మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని, గ్రౌండిరగ్ కాని వాటిపై దృష్టి పెడుతున్నామన్నారు. 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లకు గాను, 40కి పైగా పూర్తి చేశామని, మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు నిర్థేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్లాస్టిక్ నిషేదం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే పలు మార్లు ఫ్లెక్సీ బ్యానర్స్ అసోసియేషన్, వివిధ మర్చంట్స్ అసోసియేషన్‌లతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని, ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ సంచుల వాడకానికి ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.. జల్ జీవన్ మిషన్ పనులను జిల్లాల్లో మరింత వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
వీడియోకాన్పరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, జిల్లా పంచాయతీ అధికారి జె.సునీత, పంచాయతీరాజ్ ఎస్‌ఇ ఎ. వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డి వెంకటరమణ ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …