విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను అతిక్రమించే స్కానింగ్ కేంద్రాలపై కేసుల నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు. లింగ నిర్థారణ పరీక్షల నిషేదిత చట్టం అమలు పై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ అడ్వజరీ కమిటి సమావేశం గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరంగా పరిగణించాలన్నారు. వైద్యాధికారులు తరచు స్కానింగ్ కేంద్రాలను, రిజిష్టర్లను తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 252 స్కానింగ్ సెంటర్లు నమోదు అయ్యాయన్నారు. స్కానింగ్, ఇమేజింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిర్థేశించిన నియమ నిబంధనలను అనుగుణంగా ఉండాలన్నారు. అన్‌లైన్ ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, మాడిఫికేషన్‌లకు సమర్పించే అన్ని డాక్యూమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. చెక్ లిస్ట్ ఆధారంగా సమర్పించిన ధరఖాస్తులను సరిచూసుకోవాలన్నారు.ప్రతి నెల సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ అడ్వజరీ కమిటి సభ్యులు మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి, ఎసిబి జడ్జి జస్టీస్ వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రెన్యూవల్, కొత్త రిజిస్ట్రేషన్లు, మాడిఫికేషన్లకు వచ్చిన ధరఖాస్తులలో సమర్పించే దృవపత్రాలలో కాల పరిమితిని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులను మంజూరు చేయాలన్నారు. కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించి 8 కేంద్రాలకు, రెన్యూవల్‌కు సంబంధించి 6 కేంద్రాలకు, మాడిఫికేషన్‌కు సంబంధించి 20 కేంద్రాలకు అనుమతులను కమీటి అమోధించింది. కమిటీ సమావేశంలో సభ్యులు అడిషనల్ సిపి పి. వెంకటరత్నం, డియంహెచ్‌వో డా. యం సుహసిని, డిస్టిక్ టిబి ఆఫీసర్ ఎస్ పద్మావతి, డిపియంవో డా. పి నవీన్, వాసవ్య మహిళ మండలి సెక్రటరి జి. రేష్మి, తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …