Breaking News

“కుటుంబ వైద్య విధానం”తో పేదవాడికి మెరుగైన వైద్యం.

స్టొరీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని గత అక్టోబర్ 21 న గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిచే ప్రారంబించబడి పైలెట్ ప్రాజెక్టు దశలోనే వైద్య సేవలు జనం ఇళ్ళ వద్దకే వెళ్ళడంతో గ్రామీణ ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది.

పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించాలన్న సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆయన మానస పుత్రిక ఆరోగ్య శ్రీ, పథకాన్ని 2007 లో ప్రారంభించారు. 2019 లో ఆయన కొడుకుగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుజ్జీవింపచేసి నేడు 3255 చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తీసుకవచ్చారు. మన ప్రభుత్వం మన గ్రామంలోనే వైద్యం అందుబాటులో ఉండేలా ప్రతి 2 వేల మందికి వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్ లు, మన గడప వద్దకే వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పటికి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలులో ఉంది, ఉగాది నాటికి పూర్తి స్థాయిలో ప్రతి సచివాలయ పరిధిలో రెండు సార్లు పర్యటించి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా రూపుదిద్దుకోనున్నది.

తిరుపతి జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభించి ప్రభుత్వ సెలవులు మినహా మూడు వారాల్లో 33 వాహనాల (104 ఎం ఎం యు ) ద్వారా 759 గ్రామాలలో పర్యటించి 21,690 మందికి ఓ.పి. వైద్య సేవలు అందించి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సలు పొంది ఇంటి వద్దకే పరిమితమైన 402 పేషంట్లకు, వయో భారంతో, దీర్ఘ వ్యాధులతో ఇంటికే పరిమితమై ఉన్న 616 మందికి వైద్య సేవలు అందించారు.
పరీక్షలు, మందులు:
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ 104 ఎం.ఎం.యు వాహనాల ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్, 67 రకాల మందులు అందుబాటులో ఉంచి ప్రతి పౌరుడికి పరీక్షలు జరిపి వారి ఆరోగ్య సమాచారాన్ని ” డిజిటలైజ్” చేస్తారు. దీనితో ప్రతి పౌరుడి మెడికల్ రికార్డులు ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉంటాయి.
ఆబా కార్డుతో వైద్య చికిత్సలు భద్రం :
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నందు వైద్య చికిత్సలు పొందిన పౌరుడి మెడికల్ రికార్డులు డిజిటలైజ్ చేసి హెల్త్ ఐడి తో కేంద్ర ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో పూర్తి సమాచారం ఎక్కడైనా ఆన్ లైన్ లో అందుబాటు కలుగుతున్నది.

దామినేడు పి.హెచ్.సి డాక్టర్ ఆర్.పవిత్ర:
గత మాసం అక్టోబర్ 21 న కుటుంబ వైద్య విధానం ప్రారంభించాం. ప్రభుత్వ సెలవులు మినహా ఇప్పటివరకు 23 రోజులు పాటు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించాం. నేడు అవిలాల గ్రామంలో జనాభా 3800 మంది ఉన్నారు. ఇందులో ఎన్.సి.డి.మేరకు షుగర్, బి.పి., మందులు నెలకు సరిపడా 353 మందిని గుర్తించి అందిస్తున్నాం. ఉదయం నుండి ఓ.పి. వైద్య సేవలు అందించి మద్యాహ్నం పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు, ఆరోగ్య శ్రీ చికిత్సలు పొంది ఇంటి వద్దనే ఉన్న వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. దాదాపు వైద్య పరీక్షల ఆధారంగా 47 మందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెఫెర్ చేశాం.

జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి:
ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేద ప్రజలకు రవాణా ఖర్చులు తగ్గి స్థానికంగానే వైద్యం అందుకోగలుగుతున్నారు. ఇప్పటికే నాడు- నేడుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వసతులు కల్పించాం,హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు దాదాపు పూర్తి కానున్నాయి. వీటికి తోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం తో మెరుగైన వైద్యం పేదలకు అందుతున్నది.

జిల్లా నోడల్ అధికారి ఫ్యామిలీ డాక్టర్ విధానం డా.హనుమంత రావు:
గత మాసం అక్టోబర్ 21 నుండి ప్రభుత్వ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పల్లె ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. కనీసం వారం ముందే మీ గ్రామానికి వైద్య సేవల వాహనం వస్తుందని సమాచారం ఆశాలు, ఎ.ఎన్.ఎం. ల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వైద్య సేవల వల్ల ప్రజల్లో ఆనందం కలుగుతున్నది. ఎన్.సి.డి వ్యాధులకు పరీక్షలు జరిపి నెలపాటు మందులు అందిస్తున్నాం. ఆరోగ్య రికార్డులను భద్రపరుస్తున్నాం.

రాధమ్మ, స్థానికురాలు
మా పాపకు జలుబు, జ్వరంతో ఇక్కడికి వచ్చాం, డాక్టర్లు పరిశీలించి మందులు ఇచ్చారు. మామూలుగా బయటకు వెళ్లి వైద్యం చేసుకోవాలంటే కనీసం రూ.200 నుండి రూ.500 వరకు ఖర్చు అయ్యేది ఆ భాద తప్పింది. 104 వాహనం లేకున్నా సచివాలయం దగ్గరే విలేజ్ క్లినిక్ ద్వారా వైద్యం అందిస్తున్నాం . పాపకు జ్వరం తగ్గకుంటే మళ్ళీ రావాలని సూచించారు. సంతోషంగా ఉంది. పేదవారికి దగ్గరలో వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *