-గడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరైన పనులు సత్వరమే ప్రారంభించి వేగవంతం చేయాలి
-హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలనీ, గడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరైన పనులు సత్వరమే ప్రారంభించి వేగవంతం చేయాలనీ, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలనీ గృహ నిర్మాణ స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లను జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ గోపాల కృష్ణ ద్వివేది కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వర్చువల్ విధానంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జే సి డి కే బాలాజీ సంబంధిత అధికారులతో హాజరయ్యారు.
స్పెషల్ సి ఎస్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ౦ వినతులను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. హౌసింగ్ లే-అవుట్ లలో అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. జగనన్న తోడు ఫేస్ – 5 కు సంబంధించి మెప్మా అధికారులు జాబితా సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వై.ఎస్.ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ నెల 18,19 తేదీలలో రెండవ ఫేజ్ క్యాంపులు మరియు మూడవ ఫేస్ 23, 24 మరియు 25 తేదీలలో ఆధార్ క్యాంపులు జరిపి మార్పులు చేర్పులు ఉంటే సవరణలు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సానిటేషన్, త్రాగు నీరు తదితర అంశాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఆర్ అండ్ ఆర్ డి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 18,19 తేదీలలో రెండవ ఫేజ్ క్యాంపులు మరియు మూడవ ఫేస్ 23, 24 మరియు 25 తేదీలలో ఆధార్ క్యాంపులు జరిపి మార్పులు చేర్పులు ఉంటే సవరణలు పూర్తి అయ్యేలా ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్ లు చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి, డి.ఈ.ఓ శేఖర్, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖా అధికారిణి జయలక్ష్మి, హౌసింగ్ పిడీ చంద్రశేఖర్ బాబు, మెప్మా పి.డి రాదమ్మ, డి ఎం హెచ్ ఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.