Breaking News

గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 47 మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మరింతగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్, ఎమ్ డి – మార్క్ ఫెడ్ పి ఎస్. ప్రద్యుమ్న అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ గోడౌన్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించే సామర్థ్యం పెంచుకుని వారికి ఒక చక్కటి అవకాశం ఇవ్వడం సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ప్రతి ఒక్క దశలో అండగా నిలిచే క్రమంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. జిల్లాలో 41 చోట్ల పనులు ప్రారంభించాల్సి ఉండగా 32 చోట్ల టెండర్ పూర్తిచేసిన వాటి పురోగతిపై వివరాలు అడిగారు. వీటిలో 29 భవనాలు పనులు ప్రారంభించి, ఇంకా మూడు ఎందుకు పనులు చేపట్ట లేకపోయారని ప్రశ్నించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు WhatsApp గ్రూప్ ద్వారా పనుల పురోగతిపై సమీక్ష చేస్తూ, జాయింట్ కలెక్టర్ ద్వారా సమస్య పరిష్కారం చూపాలని ప్రద్యుమ్న స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ఫేజ్ 3 లో జిల్లాలో 47 ఎం.పి.ఎఫ్.సి ( మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ) గోడౌన్ల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 41 చోట్ల స్థలాలు గుర్తించడం జరిగిందని, మిగిలిన చోట్ల సాంకేతిక పరమైన సమస్యలు నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా స్థలం కోసం భూమి సేకరణ చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాలకు సంబంధించి తొలి, రెండవ దశలో చేపట్టవలసిన భవన నిర్మాణాలకు సంబందించిన భూముల సేకరణ కోసం తహశీల్దార్లు కు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేశామన్నారు. ఇంకా స్థలాలు కేటాయింపులు చెయ్య వలసిన భవన నిర్మాణ కోసం స్థలాలు కలెక్టరేట్ ద్వారా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం  నుంచి విడుదల చేసిన మొత్తాలకి చెందిన పనులు చేపట్టడం జరిగిందని, ఆయా బిల్లులను వెబ్సైట్ లో అప్లోడ్ చేశామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ఇంచార్జి జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎమ్. జగన్నాథ రెడ్డి, ఏ డీ మార్కెటింగ్ సునీల్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *