-పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. ఆర్. అమరేంద్ర కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది యాంటీబయాటిక్స్ / యాంటీమైక్రోబయల్స్ అహేతుకంగా వాడటం వలన సంబవిస్తుంది. ఇందువలన బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు మందులకు ప్రతిస్పందించకుండా తయారయ్యి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఏర్పడుతుంది, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఫలితంగా, యాంటీబయాటిక్స్ మరియు ఇతర యాంటీమైక్రోబయల్ మందులు నిరుపయోగంగా మారతాయి. దాని వలన అంటువ్యాధులకు చికిత్స చేయడం కష్టతరం అవుతుంది, వ్యాధి వ్యాప్తి, తీవ్రమైన అనారోగ్యం, మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది.
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ఆరోగ్య సమస్య. మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి తక్షణ చర్య అవసరం. మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 గ్లోబల్ పబ్లిక్ హెల్త్ హెచ్చరికలలో AMR ఒకటి అని WHO ప్రకటించింది. బాక్టీరియాలోని AMR 2019లో 10 లక్షలు మరణాలకు కారణమైందని పరిశోధకులు అంచనా వేశారు.
ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్ (WAAW) అనేది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR)పై అవగాహన మెరుగుపరచడానికి మరియు ప్రజలలో ఉత్తమ అభ్యాసాలను ప్రోత్సహించడానికి నవంబర్ 18-24 వరకు జరుపుకునే ఒక గ్లోబల్ క్యాంపెయిన్ వన్ హెల్త్ వాటాదారులు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఆక్వా రంగము, కాలుష్య నియంత్రణ మండలి మరియు పురపాలక పరిపాలనా విభాగము విధాన రూపకర్తలు. AMR యొక్క ఆవిర్భావం మరియు వ్యాప్తిని అరికట్టడానికి ఒకే గొడుగు క్రింద వీరందరూ పనిచే స్తున్నారు.
ఈ సంవత్సరం, ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్ (WAAW) యొక్క నేపథ్యం “యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌ని కలిసి నిరోధించడం.”
ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ(I.1) శాఖ యొక్క 27-06-2022 G.O.MS.No.148 ప్రకారం రాష్ట్ర స్థాయిలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కంటైన్‌మెంట్ కోసం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR)పై రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను కింది కీలక అంశాలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే ఆమోదించింది.
కొత్త యాంటీబయాటిక్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు ఇరవై సంవత్సరాలు పడుతుంది, అయితే మనం చాలా తక్కువ సమయంలోనే AMR ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణాలు
1. యాంటీమైక్రోబయాల్స్ యొక్క దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగం.
2. స్వచ్ఛమైన నీరు, ఆహారం మరియు పారిశుధ్యం లేకపోవడం
3. ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ సరిలేకపోవడం
4 . ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో ఉపయోగించని ఔషధాలను పారవేయడం చేయడం వలన AMR ఏర్పడుతుంది.
• ఆర్థిక వ్యవస్థకు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఖర్చు గణనీయంగా ఉంది. మరణం మరియు వైకల్యంతో పాటు, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఎక్కువ ఖరీదైన మందులు మరియు ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం ఉంటుంది.
• సమర్థవంతమైన యాంటీమైక్రోబయాల్స్ లేకపోతే, ప్రధాన శస్త్రచికిత్స మరియు క్యాన్సర్ కీమోథెరపీ సమయంలో సహా అంటువ్యాధులకు చికిత్స చేయడంలో ఆధునిక ఔషధం యొక్క విజయం కష్టతరం అవుతుంది.
కావున అన్ని స్థాయిలలో యాంటీబయాటిక్స్ వినియోగంలో అప్రమత్తంతో ఉండి, యాంటీబయాటిక్స్ వినియోగాన్ని, శాస్త్రీయపరమైన విజ్ఞానంతో వాడకపోతే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ వలన, పైన తెలుపబడిన అనర్థాలు జరిగే అవకాశం ఉంది.
• ఈ విషయంలో అప్రమత్తత ముఖ్యం. చివరిగా యన్టి మికరోబియల్స్ ని హేతుకంగా వాడటం, వ్యాధి నియంత్రణ, పారిశుద్ధ్యం , వ్యర్ధ పదార్ధాల నిర్వహణ శాస్త్రీయంగా చేసినట్లయితే AMR ను నిరోధించవచ్చునని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. ఆర్. అమరేంద్ర కుమార్ వివరించారు.