విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రైవేట్‌గా నిర్మించిన తొలి రాకెట్ విక్రమ్-ఎస్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భారత అంతరిక్ష యాత్రలో ఇది ఒక మైలురాయి వంటిదన్న గవర్నర్ , భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడడం ఒక చారిత్రాత్మక సందర్భమన్నారు మరియు రాకెట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి అభినందనలు తెలిపారు. మూడు పేలోడ్లను మోసుకెళ్లటం అందులో ఒకటి మన భారతీయ విద్యార్ధుల భాగస్వామ్యంతో తయారు కావటం ముదావహమని గవర్నర్ హరిచందన్ అన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …