-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 10.12 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 28 వ డివిజన్ లక్ష్మీనగర్లో రూ. 10.12 లక్షల నిధులతో స్ట్రోం వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజావసరాలను తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అందించేందుకు గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రాంతంతో పర్యటించిన సమయంలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడాన్ని గుర్తించడం జరిగిందన్నారు. సమస్య పరిష్కారానికి 20 ఛాంబర్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతిఒక్క కాలనీని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ వీరమాచనేని లలిత, నాయకులు కనపర్తి కొండా, వేదాంతం చైతన్య, బెజ్జం రవి, శ్రీనివాస్, సాంబయ్య, కగ్గా పాండు, మానం వెంకటేశ్వరరావు, మేడేపల్లి ఝాన్సీ, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు