విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానది వెంబడి కరకట్టవాసులకు రక్షణగా మూడవ దశలో నిర్మించే రిటైనింగ్ వాల్‌కు టెండర్లు, శంకుస్థాపన పనులు చేపట్టేందుకు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు, నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుడ్కర్లతో కలసి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపు నుండి శాశ్వత పరిష్కార దిశగా పద్మావతి ఘాట్ మరియు కనకదుర్గా వారధి మధ్య కృష్ణానది వెంబడి 1.05 కిలో మీటర్ల్లు పొడవున 137.85 కోట్ల రూపాయల నిధులతో రిటైనింగ్ వాల్ మూడో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెదం తెలిపిందన్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన దాదాపు 50, 000 మంది ప్రజలు నివసిస్తున్నారని గత కొన్నేళ్లుగా ప్రకాశం బ్యారేజీ నుంచి మిగులు జలాలను విడుదల చేయడంతో చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకా నగర్, బ్రమరాంబపురం వంటి తోతట్టు ప్రాంతాలు ముంపునకు గురువుతున్నాయన్నారు. కోటినగర్ నుండి యనమలకుదురు మధ్య 2.2 కిలో మీటర్ల పొడవున మొదటి దశ, కనకదుర్గమ్మ వారది నుండి కోటి నగర్ వరకు 1.2 కిలో మీటర్ల పొడవున 122.90 కోట్ల రూపాలయల నిధులతో రెండవ దశలో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. మూడవ దశ నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్దం చేయాలని కలెక్టర్ జలవనరుల శాఖలను ఆదేశించారు. మూడవ దశ రిటైనింగ్ వాల్ పూర్తి అయితే కృష్ణలంకలోని రణదీవ్ నగర్, గౌతమినగర్, నెహ్రు నగర్, ద్వారక నగర్లో నివసిస్తున్న 30 వేల మంది జనాభాకు వరద ముంపు నుండి రక్షణ కలుగుతుందన్నారు. 12 లక్షల క్యూసెకుల వరద ముంపునుండి తట్టుకునేలా నదీ తీర ప్రాంత ప్రజలకు రక్షణ కలుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …