-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ శనివారం అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో జక్కంపూడి గృహ నిర్మాణముల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వము వారు నిర్మించిన టిడ్కో గృహముల కేటాయింపు 6576 మంది లబ్దిదారులకు కేటాయించుట జరిగినది. ఇందులో 300 Sq. Ft 1152, 365 Sq. Ft 1632 మరియు 430 Sq. Ft 3792 ఫ్లాట్స్ కేటాయించడమైనది. పూర్తిగా నిర్మాణంలో 1680 ఫ్లాట్స్ ను నగరపాలక సంస్థ సిద్దం చేయడం జరిగినది. మిగిలిన గృహ నిర్మాణాలకు సంబంధించి అధికారులు మరియు కాంట్రాక్టర్ లతో చర్చించి పనులను వేగవంతముగా నిర్మించాలని ఆదేశాలు జారీచేసినారు. అదే విధంగా విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. తదుపరి గ్రీనరి పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా అకర్షణీయమైన మొక్కలు చుట్టూ ఏర్పాటు చేయాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన 200 మొక్కలను కమీషనర్ గారి చేతుల మీదుగా నాటడం జరిగినది.