-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి వెలగలేరు ప్రాంతంలో జరుగుతున్న జగనన్న ఇళ్ళ లే అవుట్ లో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారుల గృహ నిర్మాణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులకు ఆదేశించారు. జగనన్న ఇళ్ళ లే అవుట్ లో జరుగుతున్న పనులను పరిశీలించి విద్యుత్ శాఖ వారితో చర్చించి 24 గం.లు కరెంటు ఉండే విధంగా Three-phase కరెంటు ఏర్పాటు చేయమని కమీషనర్ గారు ఆదేశాలు జారీచేసినారు. అదే విధంగా మంచినీటి సంబందిచి పోలవరం వాగు నుండి నీరుని తీసుకోచే విధంగా ఏర్పాటు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రాంతములలోని నిరుపేదలకు సొంతింటి కలను నేరవేర్చేoదుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా జననన్న గృహ నిర్మాణ పథకం క్రింద అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. లే అవుట్లో లబ్దిదారులు గృహా నిర్మాణం చేపట్టేందుకు అవసరమగు కనీస సౌకర్యాలైన విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.