విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం BRTS రోడ్డు, భానునగర్ కేంద్రీయ విద్యాలయం దగ్గర ఉన్న వీరమాచినేని లలిత కార్పొరేటర్ కార్యాలయం దగ్గర రచ్చబండ తరహాలో టీడీపీ తెలుగు మహిళా వినూత్నం గా మాట -మంతి పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, Ex ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు నాయకత్వంలో సెంట్రల్ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసిపి అరాచక పాలన గురించి ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో మరియు ఈ అరాచక పాలనలో మహిళల అభిప్రాయం తెలుసుకోవటమే ఈ మాట.. మంతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చెయ్యటానికి అన్నివిధాల సహకరించిన మా అన్నయ్య బొండా ఉమా కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ మూడున్నర ఏళ్ల పాలనలో పెంచిన నిత్యవసరధరలను, చెత్తపన్ను, కరెంట్ బిల్లులు, వంట గ్యాస్ ధరలు చూసి మహిళలు తిట్టుకోని రోజు లేదని అన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఇసుక కొరతతో ఇంటి యజమానికి సరైన ఉపాధికుడా దొరకని పరిస్థితి ఏర్పడిందని , ఇల్లు గడవటం కూడా కష్టం అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మధ్య నిషేధం చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ఇప్పుడు నకిలీ మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ నేతలు, రాష్ట్ర మహిళా నాయకులు, జిల్లా తెలుగు మహిళా నేతలు, పెద్ద ఎత్తున మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …