Breaking News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సం

-ఉద్యోగుల సంక్షేమమే సంఘ లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సం లో భాగంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజారావు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం ఆత్మగోరవం కోసం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబార్డినేట్ నుండి అధికారివరకు సభ్యత్వం తో అన్ని శాఖలకు ప్రాతినిధ్యం వహించే విధంగా సంఘాన్ని ఏర్పాటు చేసి అనతికాలంలోనే పిబ్రవరిలో లక్షలాది ఉద్యోగుల సంక్షేమం కొరకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం ఆహ్వానం మేరకు చర్చలకు వెళ్ళి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం చూపిన చొరవతో ఉద్యోగుల మన్ననలు పొందటమే కాకుండా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకొన్నామని, దీని ద్వారా మాబాధ్యత మరింత పెరిగిందని ఈ సంవత్సర కాలంలో అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కారానికి చొరవ చూపామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సం సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజరావు స్పష్టం చేశారు. ప్రధమ వార్షికోత్సం సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ మచ్చా నాగరాజు కొన్ని తీర్మాణాలను ప్రవేశపెట్టిన వాటిని సంఘ కార్యవర్గ సభ్యులు ఆమోదించడం జరిగింది. కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలి, అర్హులైన న వారికి ప్రభుత్వ శాఖల్లో నియమించాలి.రాష్ట్రంలో OPS ను అమలు చేయాలి. గామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వత్తడి తగ్గించాలి.ఉద్యోగులకు రావలసిన డి.ఏ, జి.పి.ఫ్, ఏపీ.జి .ఎల్.ఐ వెంటనే మంజూరు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎంటిఎస్ విధానం తొలగించాలి100% గ్రాస్ శాలరి మంజూరు చేయాలి.ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలను ప్రక్షాళన చేయాలి.12వ PRC కి అన్ని డిపార్ట్ మెంట్ సంఘాలను ఆహ్వానించాలి ఉద్యోగుల సంక్షేమం సలహాదారులవ్యవస్థను పటిష్టం చేయాలి.ఈ సమావేశంల ముఖ్య అతిధిగ Av.నాగేశ్వరరావు, ఛైర్మన్, కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జె.ఏ.సి. మచ్చనాగరాజు వర్కింగ్ ప్రసిడెంట్, డాక్టర్ సిద్దార్థ, వరమూరి సుజాత, ఎన్.కే.వి.ప్రసాద్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు రఘుపతి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, బాపట్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యంరాజు, బడుగు శివాజీ, ప్రకాశం జిల్లా అసోషియేట్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి రెడ్డి , NTR కృష్ణాజిల్లా అధ్యక్షుడు కోటా రవి, డాక్టర్ మోహన్ రావు, సురేష్, డివి రాజు ,వెంకటేశ్వరనాయక్ ,రాబర్ట్, విమల ,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *