Breaking News

అధికారుల్లో పని ఒత్తిడి తగ్గించే మానసిక ఉల్లాసానికి వన సమారాధనలు తోడ్పడతాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖా పరమైన పనులలో లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఒత్తిడికి లోనయ్యే అధికారులకు కొంత ఆహ్లాదకరమైన వాతావరణం అవసరమని ఇందుకు వన సమారాధనలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ ఫ్లై పార్కు లో ఆదివారం జిల్లా అధికారుల కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంస్ధ . తూర్పుగోదావరి జిల్లా కడియం నుండి తీసుకువచ్చిన 150 కు పైగా వివిధ రకాల ఔషధ మొక్కలను జిల్లా కలెక్టర్ డిల్లీ రావు అధికారులతో కలిసి నాటారు. అనంతరం వన సమారాధనలో కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారుల్లో పని ఒత్తిడి తగ్గించే మానసిక ఉల్లాసానికి వన సమారాధనలు తోడ్పడతాయన్నారు. రోజువారి పనిఒత్తిడి నుండి కొంత సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడపడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తారన్నారు. అధికారులు విధులతో పాటు కొంత సమయాన్ని ప్రశాంతతకు కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. అన్ని రంగాల్లోనూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ డిల్లీ రావు అధికారులను కోరారు.

పర్యాటకులను కనువిందు చేసేలా బట్టర్ ఫ్లై పార్క్…
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోని బట్టర్ ఫ్లై పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అన్ని రకాల మౌలికవసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. కార్తీక వన సమారాధనలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రంగురంగులతో వందలాది రకాల సీతాకోకచిలుకలతో ఈ ప్రాంతం మరింత శోభను సంతరించుకుందన్నారు. ఈ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇక్కడ 23 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయన్నారు. ఈ పార్కులో పర్యాటకులకు అవసరమైన వాష్ రూమ్స్, త్రాగునీరు, అదనపు బెంచీలు వంటి మౌలికోసతులను 50 లక్షల రూపాయలు వేయడంతో అభివృద్ధి చేయనున్నట్టు కలెక్టర్ అన్నారు. కొత్తూరు తాడేపల్లి లోని నగరవనాన్ని, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోని బటర్ ఫ్లై పార్కును మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ అన్నారు. బటర్ఫ్లై పార్క్ విశిష్టతను కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులకు వివరించారు. బటర్ఫ్లై అనేది అందమైన కీటకమని, గొంగళి పురుగు నుండి రూపాంతరం చెంది అందమైన సీతాకోకచిలుకగా పరిణామం చెందుతుందన్నారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీతాకోకచిలుకలు తక్కువగా ఉన్నచోట కాలుష్యం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తెలిపారన్నారు. మానవ మనుగడకు సహకారిగా ఉంటున్న సీతాకోకచిలుకలు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.

కార్తీక వన సమారాధనలో జిల్లాకలెక్టర్ డిల్లీ రావు అధికారులతో కలసి ఆటపాటలతో వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె.సునీత ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచి, అందరిలోనూ ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ డి. వెంకటరమణ, డీఈఓ సివి రేణుక, డీఎస్ఓ పి కోమలి పద్మ, డి ఎం అండ్ హెచ్ ఓ ఎం సుహాసిని, ఐసిడిఎస్ పిడి రమాదేవి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ సిహెచ్ శైలజ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.విజయభారతి, డిఆర్ డిఎ పిడి కిరణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జెడి కె. విద్యాసాగర్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పివి రమేష్ కుమార్ ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిల్ కుమార్ , మాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ జనరల్ మేనేజర్ దోనేపూడి మహంతి, మేనేజర్ క్రాంతి కుమార్, ఎంపీడీవో బి. రామకృష్ణ నాయక్, తహాసిల్దార్ ఎం. సూర్యారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *