రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని నియోజక వర్గాల లో 1962 డా. వైయస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలు (నా సంచార పశు వైద్య వాహనాలు) లలో పనిచేయుటకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పైలట్స్ (డ్రైవర్స్) భర్తీ కోసం దరఖాస్తులు కోరడం జరుగుతోందని జిల్లా పశు వైద్య అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండో విడతలో భాగంగా సంచార పశు సేవా 1962 వాహనాలు పంపిణీ చెయ్యడం ద్వారా పూర్వపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా లోని అన్ని నియోజక వర్గాల కోసం ఈ ఎంపిక ప్రక్రియ ను మేసర్స్ జీ వి కే సంస్థ ద్వారా నవంబర్ 22 మరియు 23 వ తేదీలలో గోకవరం బస్ స్టాండ్ సమీపంలో వున్న జిల్లా పశు వైద్య శాల, జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం, రాజమహేంద్రవరం లో ఆయా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ లను నిర్వహించి, సర్టిఫికెట్స్ పరిశీలన చెయ్యడం జరుగుతుందని ఆయన తెలిపారు.
అర్హత వివరాలు తెలుపుతూ, పశు వైద్యులకి బి వి ఎస్సీ లో ఉత్తీర్ణత, పదవీ విరమణ, చేసిన పశు వైద్యులు ; పేరా వెటర్నరీ సిబ్బంది కి డిప్లొమా ఇన్ వేటర్నిటీ సర్వీస్, (వయోపరిమితి 30 సం.ముల లోపు) ; పైలట్ (డ్రైవర్) కి 10 వ తరగతి లేదా ఎస్ ఎస్ ఈ, హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కనీసం రెండు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
నవంబర్ 22 వ తేదీన ఉదయం 10 గంటల లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రాజమహేంద్రవరం , జిల్లా పశు వైద్య శాల వద్ద నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని తెలిపారు. మరింత సమాచారం కోసం జీవీకే సంస్థ ప్రాంతీయ కో ఆర్డినేటర్ మోహన్ గాంధీ (9160566668) ను సంప్రదించండి.