కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ` కొవ్వూరు
కొవ్వురు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయములొ ది.14-11-2022 నుండి నిర్వహించుచున్న 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు దినోత్సవం సభను ఈ రోజు ది.20-11-2022 న నిర్వహించడమైనది. ఈ కార్యక్ర్రమంలో ముఖ్య అతిథులుగా కె.శారదాంబ, మెజిస్ట్రేట్, కొవ్వూరు, ఎస్.మల్లిబాబు, రెవిన్యూ డివిజనల్ అధికారి, కొవ్వూరు మరియు పి.చంద్రశేఖర్, డివిజనల్ వ్యవసాయాధికారి, కొవ్వూరు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా హాజరైన విద్యార్థులచే స్వీయపఠనము(చదవడం మాకిష్టం) కార్యక్రమం గోవర్థనం శ్రీనివాసమూర్తి, సంస్కృత పాఠశాల ప్రథానోపాధ్యాయులు నిర్వహించడం జరిగినది.
ఈ కార్య్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనకె.శారదాంబ, IIndఎడిషనల్ జుడిషియల్ ఇష్టం క్లాస్ మెజిస్ట్రేట్, కొవ్వూరు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా, ఏ విషయంలోనైనా రాణించాలంటే అది పుస్తక పఠనం ద్వారా సాధించవచ్చని, చిన్నతనం నుండి నా యొక్క అభివృద్థికి గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడినదని తెలిపారు. పుస్తకాలతో స్నేహం చేయడం ద్వారా మనం మంచి విజ్ఞానాన్ని పొందవచ్చని, అటువంటి విజ్ఞానాన్ని గ్రంథాలయాలలో ఉన్న రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా పొందవచ్చునని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక ముఖ్య అతిధి ఎస్.మల్లిబాబు, రెవిన్యూ డివిజనల్ అధికారి, కొవ్వూరు మాట్లాడుతూ ఎమీ రానటువంటి ఒక వ్యక్తి ఒక మంచి ఉద్యోగాన్ని పొంది మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే అది గ్రంథాలయం ద్వారా మాత్రమే పొందినదని తెలిపారు, మీ తరగతి పుస్తకాలే కాకుండా వారానికి ఒక రోజు లేదా ఒక గంట గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న రకరాకాల పుస్తకాలు చదవడం ద్వారా మానసిక ఆనందాన్ని, మేథోవికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక విశిష్ట అతిథి పి.చంద్రశేఖర్, డివిజనల్ వ్యవసాయాధికారి, కొవ్వూరు మాట్లాడుతూ నేను గ్రంథాలయానికి వచ్చే కాంపిటేటివ్ పుస్తకాలను ఉపయోగించుకొని ఈ ఉద్యోగాన్ని సాధించానని మీరు కూడా గ్రంథాలయానికి రావడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు, వివిధ పాఠశాలల ప్రథాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గోన్నారు. అనంతరం ది14-11-2022 నుండి19-11-2022 పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వము, సంగీతము, క్విజ్ మరియు రంగోలి పోటీలలో పాల్గొని మొదట, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ స్థానాలలో నిలిచిన 70 మంది విద్యార్థులకు ముఖ్య అతిధుల చేత బహుమతులు అందజేయడం జరిగినది.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …