– డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 22 మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా కు 15 కంపెనీ లు హాజరు కావడం ద్వారా సుమారు 1200 మందికి ఉద్యోగాలు కోసం ఇంటర్వూ లను నిర్వహిస్తున్నామన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, బొమ్మురూ రాజమహేంద్రవరం ప్రాంగణం లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అభ్యర్థులు వారి పేర్లు నమోదు చేసుకోవడానికి సంబందించిన సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.