-జిల్లాలో 47 ప్రత్యేక ఆధార్ అప్డేషన్ కేంద్రాలు
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 42 ఆధార్ నమోదు ప్రత్యేక కేంద్రాల ద్వారా నవంబర్ 18, 19 తేదీల్లో 2,288 మంది కి చెందిన ఆధార్ లావాదేవీలను నిర్వహించగా జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు కలిగి ఉండి గత 10 సంవత్సరాల పాటు ఎటువంటి లావాదేవీలను నిర్వహించని ప్రతి ఒక్కరూ ఆధార్ లావాదేవీలో భాగంగా నవీకరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. చిరునామా, బయో మెట్రిక్ అప్డేషన్, తదితర ఏదో ఒక తరహా చేపట్టవలసి ఉందన్నారు. ఇందులో భాగంగా శాశ్వత ఆధార్ కేంద్రాలతో పాటుగా ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను జిల్లాలోని 47 సచివాలయలలో ఏర్పాటు చెయ్యడం జరుగుందన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఆధార్ నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ తెలియచేశారు. ఈ 47 ప్రత్యేక ఆధార్ కేంద్రాలు నవంబర్ 23,24,25 తేదీలలో ఆధార్ నవీకరణ చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతున్న వారు, అమ్మఒడి తదితర పథకం కింద నమోదైన పిల్లలు వారి ఆధార్ బయో మెట్రిక్, చిరునామా లను ఆధార్ కేంద్రాల ద్వారా తప్పని సరిగా నవీకరణ చేసుకోవడం చాలా ముఖ్యం అన్నారు.