-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా ఎస్. టి. జి. సత్యగోవింద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద పర్వ్ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఆయుర్వేద, నేచురో పతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, డా ఎస్. టి. జి. సత్య గోవింద్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద పర్వ్ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఆనం కళా కేంద్రంలో జరిగిన కార్యక్రమం లో సత్య గోవింద్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్య గోవింద్ మాట్లాడుతూ అధ్యాయనం, పరిశోధనల ద్వారా ప్రాచీన వైద్యాన్ని భావితరాలకు అందించడం కోసం ప్రధానంగా ఆయుష్ శాఖ పని చేస్తోందని అన్నారు.దేశ వ్యాప్తంగా మన ప్రాచీన వైద్యా న్ని ప్రపంచానికి అందిస్తోందన్నా రు. ఈ జాతీయ ఆయుర్వేద పర్వ్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు. . ఆయుర్వేద, నేచురోపతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం అందించడమే కాకుండా వేడుకల్లో భాగంగా ఉచితంగా మందుల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంలో ఆయూర్వేద, తదితర సంప్రదాయ వైద్య పరంగా పేపర్ ప్రెసెంటేషన్, డ్రాయింగ్, డిబేట్, కాంపిటే టేషన్లో పాల్గొన్న విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు సత్య గోవింద్ చేతులు మీదుగా అందించారు. ఈ ర్యాలీ లో ఆర్ట్స్ కాలేజీ, మహిళా కాలేజ్, ఎన్. ఎన్. ఎస్ విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొ న్నారన్నారు. ఈ కార్యక్రమం లో జాతీయ కన్వీనర్, ఆయుర్వేదిక్ పర్వ్ మనోజ్ జిన్నా, స్టేట్ కన్వీనర్ బాలు అక్కిస, డా. రామ్ అవతార్ శర్మ, డా. మురళి కృష్ణ, డా. సుజాత, డా. సాయి ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.