Breaking News

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న మహిళమణులు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పరిపాలనకు రాష్ట్రంలో ఉన్న మహిళమణులు అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్, 6వ సచివాలయం పరిధిలోని సీటీఓ కాలనీ ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో కూడా చేయనివిధంగా వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. సంక్షేమ పథకాలలో గాని, రాజకీయ పదవులలో గాని మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు, రాష్ట్రంలో మహిళా రక్షణ కు దిశా చట్టం చేసిన ఘనత జగనన్నదే అని, అందుకే గడపగడపకు వస్తున్న నాయకులకు మంగళ హారతులు పడుతూ మహిళలు తమ మద్దతు తెలియజేయడం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి దాదాపు 8కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని, అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వారి మాయ మాటలు నమ్మి మోసపోయామని గ్రహించిన ప్రజలు నేడు స్వచ్చంధంగా బయటకు వచ్చి వైస్సార్సీపీ కి మద్దతు తెలుపుతున్నారని, గెలుపోటములతో సంబంధం లేకుండా డివిజన్ ను అభివృద్ధి చేస్తున్నారు అని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ గెలుపుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని కాలనీ పెద్దలు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్ననదుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ,జనసేన నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ, వారి అక్కసు వెళ్లగక్కడం సిగ్గుచేటు అని, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ఎలా గెలుస్తుందో చూస్తా అని ఛాలెంజ్ లు విసురుతున్నారని,మీ మాటల్లో అసహనం పార్టీని ఎలా కాపాడుకోవాలి తెలియని నిరాశ కనిపిస్తుంది అని ఎద్దేవా చేశారు. మీరు అలా చూస్తూనే ఉండండి ప్రజల ఆశీర్వాదం, మద్దతు తో వైస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కేవలం మీకున్న సినీ గ్లామర్ తోనే మీ సభలకు జనాలు వస్తున్నారు తప్ప వారి ఓటు మాత్రం వైస్సార్సీపీ కె వేస్తారు ఎందుకంటే వారికి తెలుసు పార్టీలకతీతంగా వారి ఇళ్లలో కూడా నేడు జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని, వారందరి మద్దతు తో జగనన్న మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవినాష్ ఘంటపధంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి, గల్లా రవి, రామచంద్రారెడ్డి, మీర్ హుస్సేన్, జె.జె.సింగ్, రవీంద్ర, తరుణ్, ప్రసాద్ రెడ్డి, సాయి, రమణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *