Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు…

-పోలవరం ముంపు మండలాల్లోని మున్నూరు కాపులకు రాష్ట్రంలో బీసీ-డీ రిజర్వేషన్లు..
-గత ప్రభుత్వం కాపు సంక్షేమం కోసం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం 1,400 కోట్లు..
-కాపు సంక్షేమానికి వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం..
-కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి వెల్లడి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలనను అందిస్తూ.. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి (శేషు) తెలిపారు. కాపుల కోసం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కలిసిన పోలవరం ముంపు మండలాల్లోని మున్నూరు కాపులకు బీసీ-డి రిజర్వేషన్లు కల్పించడం, తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ల కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కొంతమంది నాయకులు ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో కాపు కార్పోరేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ… రాష్ట్రంలో మూడేళ్లలోనే వివిధ పథకాల క్రింద కేవలం కాపు సోదరులకు రూ.32 వేల కోట్లకు పైగా లబ్ధిని అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ‘కాపు భవన్’ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపారు. ఇప్పటికే అనంతపురం, నెల్లూరు, వైజాగ్ లో కాపు భవన్ లు పూర్తయ్యాయన్నారు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించినా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ‘నవరత్నాలు’ పథకాల ద్వారా అందజేసిన ఆర్థిక చేయూతతోనే పేద ప్రజలు జీవనం సాగించిన పరిస్థితులున్నాయన్నారు. ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో, చేస్తున్న మంచి కార్యక్రమాలతో రానున్న రోజుల్లో కూడా జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.. ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దీనిలోభాగంగానే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులను పదేపదే ప్రస్తావనలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలను, మంత్రులను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఈ ప్రభుత్వంపై ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. కాపులకు ఎవరి హయాంలో ఎంత సంక్షేమం చేశామో చర్చ ఎక్కడైనా, ఎప్పుడైనా రెడీ అంటూ ప్రతిపక్షాలకు చైర్మన్ అడపా శేషు సవాల్ విసిరారు. 2014 నుండి 2017 వరకూ కాపు కార్పోరేషన్ కు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కాపు సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం రూ.1400 కోట్లు మాత్రమేనని తెలిపారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపునేస్తం ద్వారా సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 2,500 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ‘కాపు నేస్తం’ పథకం ద్వారా రూ.1,500 కోట్ల లబ్ధి చేకూర్చారన్నారు. గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో జరిగిన అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పథకానికి నిథులు ఎలా విడుదలవుతాయని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. మెరిట్ స్టూడెంట్స్, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ క్రింద ఆర్థికసాయం అందిస్తున్నామని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యలకల చలపతిరావు, బాలగోవింద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *