Breaking News

జ్యోతిరావ్ ఫూలే సేవలు, ఆశయం చిరస్మణీయం…

-హోం శాఖ మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జీవితం ఆదర్శనీయం, సదా చిరస్మరణీయం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టరు డా. మాధవీలతతో కలసి మంత్రి తానేటి వనిత మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని ఆయన చెప్పారు. సమాజానికి గొప్ప స్ఫూర్తిప్రదాత అని, దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నప్పుడు పోరాటం చేసి సమాజ ఉన్నతికి, బడుగు బలహీన వర్గాల, మహిళల కోసం కృషి చేశారని అన్నారు. బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి 1848 లోనే పుణేలో పాఠశాలను స్థాపించారని మంత్రి పేర్కొన్నారు. విద్య ప్రాధాన్యతను ఆనాడే ఫూలే తెలియజేసారన్నారు. సమాజంలో ఆనాడు ఉన్న రుగ్మతల పై సంస్కరణ కోసం ఉద్యమాలను నిర్వహించారని తెలిపారు. అట్టడుగు, బడుగు బలహీనవర్గాల పట్ల అండగా నిలిచిన వ్యక్తి ఫూలే దంపతులని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జ్యోతిరావు ఫూలే అడుగుజాడలలో నడుస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పాలన అందిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పారు. ప్రతి కుటుంబం అభ్యున్నతిని సాధించాలని ఆర్థిక సహాయక కార్యక్రమాలను వివిధ సంక్షేమ పథకాలు ద్వారా అమలు చేస్తున్నారని వివరించారు. జ్యోతిరావు ఫూలే మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఉన్నత సమాజం ఆవిర్భావానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావ్ ఫూలే. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అన్నారు. ఫూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. సమాజం విద్యాపరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని చెప్పిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో డి.ఆర్వో జి. నరశింహులు, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *